Peddi Movie : జీవితంలో డబ్బు, సదుపాయాలు ఎంత ఉన్నా.. మనకంటూ ఒక గుర్తింపు లేనప్పుడు, కన్నతల్లిలాంటి ఊరికి గుర్తింపు లేకుంటే ఆత్మగౌరవం లేనట్టే. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపును తెచ్చే మీ ప్రతిభను, మీ వృత్తిని ఎప్పుడూ వదులుకోవద్దు. ఎందుకంటే, మన పనిలో మనకు లభించే ఆ గుర్తింపే మన ఆత్మగౌరవానికి అసలైన పునాది. మన ఊరికి మనం తెచ్చే గొప్ప పేరు అదే.

రామ్‌చరణ్ పెద్ది సినిమా, అందులోని పాత్రల ప్రయాణం ప్రతి ఒక్కరినీ తమ జీవితాన్ని కొత్త కోణంలో చూసుకునేలా ప్రేరేపిస్తుంది. ఈ కథనంలో ‘పెద్ది’ అనే పాత్ర ఒక సామాన్యమైన నేపథ్యం నుండి వస్తుంది. ఆధునిక కాలంలో మనం లగ్జరీ లైఫ్, వేగవంతమైన ప్రపంచం వెనుక పరిగెడుతూ.. మన మూలాలను, మానవత్వపు విలువలను మరిచిపోతున్నాం. కానీ ఈ సినిమాలో కథానాయకుడు తనదైన నమ్మకాలు, క్రమశిక్షణ, పట్టుదలతో ఎలాంటి సవాళ్లనైనా ఎలా ఎదుర్కొన్నాడనేది చూపించారు.
జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, మనం ఎక్కడి నుంచి వచ్చామో మరిచిపోకూడదు. మన సంస్కృతి, సింపుల్ లైఫ్‌స్టైల్ మనకు మానసిక ప్రశాంతతను, నిజమైన విజయాన్ని అందిస్తాయి.
పెద్ది నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు
ఓర్పు - నిశ్శబ్ద పోరాటం: సమస్యలు వచ్చినప్పుడు ఆవేశపడటం కాకుండా, ‘పెద్ది’ పాత్రలాగా నిశ్శబ్దంగా, వ్యూహాత్మకంగా ముందడుగు వేయడం అలవాటు చేసుకోవాలి.
ఆరోగ్యకరమైన అలవాట్లు: ప్రకృతికి దగ్గరగా బతకడం, శారీరక శ్రమను గౌరవించడం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
నమ్మకమే మీ బలం: సమాజం మిమ్మల్ని తక్కువ అంచనా వేసినా, మీ ప్రతిభపై, మీ శ్రమపై మీకు నమ్మకం ఉంటే ఒకరోజు విజయం మీ పాదాల చెంతకు చేరుతుంది.
సహాయపడే గుణం: మన ఎదుగుదల కేవలం మన కోసమే కాకుండా, మన చుట్టూ ఉన్న నలుగురి బాగు కోసం ఉపయోగపడినప్పుడే ఆ జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది.
{{/usCountry}}సహాయపడే గుణం: మన ఎదుగుదల కేవలం మన కోసమే కాకుండా, మన చుట్టూ ఉన్న నలుగురి బాగు కోసం ఉపయోగపడినప్పుడే ఆ జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది.
{{/usCountry}}పెద్ది సినిమాలో విజయనగరం జిల్లాలో కొండ కింద ఉన్న ఊరిలో వందల మంది జీవనం సాగిస్తున్నా.. ఆ ఊరికి గుర్తింపే ఉండదు. దానికోసం ఎవరు ఎలా కష్టపడ్డారు అని సినిమాలో చూడవచ్చు. ఒక ఊరికి గుర్తింపు లేకపోవడం అంటే, ఆ ఊరిలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరి ఉనికి, ఆత్మగౌరవం దెబ్బతినడమే.
- 'ఊరు అంటే కేవలం మనుషులుండే భూభాగం కాదు.. అది ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం. ఊరికే గుర్తింపు లేనప్పుడు, అందులో బతికే మనిషి ఉనికికి విలువ ఎక్కడుంటుంది?"
- “దేశపటంలో నీ ఊరి పేరు లేనప్పుడు, నీ పాస్‌పోర్ట్‌లో ఎంత గొప్ప ముద్ర ఉన్నా నీ ఆత్మగౌరవం సగం చచ్చిపోయినట్లే!”
- “తల్లి లాంటి ఊరిని సమాజం గుర్తించనప్పుడు, ఆ తల్లి బిడ్డలుగా మన ఆత్మగౌరవం గాయపడటం సహజం. మన ఊరిని గౌరవించుకోవడం అంటే, మనల్ని మనం గౌరవించుకోవడమే.”
- “ఒక మనిషికి పేరు ఎంత ముఖ్యమో.. ఒక ఊరికి గుర్తింపు అంత ముఖ్యం. గుర్తింపు లేని ఊరు, ఆత్మగౌరవం లేని బతుకు.. రెండూ ఒక్కటే!”
- “నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా.. నీ మూలాలున్న ఊరికి గుర్తింపు లేకపోతే, నీ విజయానికి పరిపూర్ణత దక్కదు. ఊరి గౌరవంలోనే మన ఆత్మగౌరవం దాగి ఉంది.”
- "సమాజం మన ఊరిని నిర్లక్ష్యం చేసినప్పుడు కలిగే ఆవేదన.. మన ఆత్మగౌరవంపై జరిగే దాడి లాంటిది. ఆ నిశ్శబ్దానికి బదులు, మన ఊరి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడమే దానికి అసలైన సమాధానం."
ఇలాంటి విషయాలన్నీ పెద్ది సినిమా చూస్తే అర్థమవుతుంది. కష్టపడటం వలన వచ్చే ఫలితాలను, ఊరికి గుర్తింపు తీసుకువచ్చే పనులను మన జీవితంలోనూ చేయెుచ్చు.