కమింగ్ సూన్ అంటూ జియోహాట్‌స్టార్ ప్రోమోలు, పోస్టర్లు రిలీజ్ చేస్తోంది తప్పా.. ఓటీటీ డేట్ మాత్రం అనౌన్స్ చేయడం లేదు.. ఇదీ లోకా చాప్టర్ 1 చంద్ర ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఫ్రస్టేషన్. బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ గా నిలిచిన లోకా చాప్టర్ 1 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.
లోకా చాప్టర్ 1 ఓటీటీ

ఇండియా ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ ‘లోకా చాప్టర్ 1-చంద్ర’. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ మలయాళ సూపర్ హీరో థ్రిల్లర్ మూవీ కలెక్షన్ల రికార్డులు నమోదు చేస్తోంది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా నిలిచింది. ఈ మూవీ జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి రాబోతుంది.లోకా చాప్టర్ 1- చంద్ర కమింగ్ సూన్ అంటూ ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రోమోలు, పోస్టర్లు షేర్ చేస్తూనే ఉంది.
ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
జియోహాట్‌స్టార్‌లోకే లోకా చాప్టర్ 1 మూవీ వస్తుందనేది ఇప్పుడు పాత విషయం. ఎప్పుడు ఓటీటీలోకి రిలీజవుతుందన్నదే క్వశ్చన్ మార్క్ గా మారింది. డిజిటల్ ప్రీమియర్ డేట్ ను మాత్రం ఈ ఓటీటీ ఇంకా అనౌన్స్ చేయడం లేదు. ఆగస్టు 28న థియేటర్లలో రిలీజైన లోకా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ అక్టోబర్ 23 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందన్నది లేటెస్ట్ బజ్.
పోస్టులే పోస్టులు
లోకా చాప్టర్ 1 చంద్ర ఓటీటీలోకి కమింగ్ సూన్ అంటూ జియోహాట్‌స్టార్ సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు రిలీజ్ చేస్తోంది. అయితే విడుదల తేదీని మాత్రం వెల్లడించడం లేదు. "ఒక కొత్త విశ్వం ప్రారంభం. లోకా చాప్టర్ 1: చంద్ర - త్వరలో జియో హాట్ స్టార్ లో రాబోతోంది"అని ఆ ఓటీటీ పోస్టర్ పోస్టు చేసింది. ఈ సినిమాను వేఫెరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ నిర్మించాడు.
లోకా చాప్టర్ 1 గురించి
{{/usCountry}}లోకా చాప్టర్ 1 చంద్ర ఓటీటీలోకి కమింగ్ సూన్ అంటూ జియోహాట్‌స్టార్ సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు రిలీజ్ చేస్తోంది. అయితే విడుదల తేదీని మాత్రం వెల్లడించడం లేదు. "ఒక కొత్త విశ్వం ప్రారంభం. లోకా చాప్టర్ 1: చంద్ర - త్వరలో జియో హాట్ స్టార్ లో రాబోతోంది"అని ఆ ఓటీటీ పోస్టర్ పోస్టు చేసింది. ఈ సినిమాను వేఫెరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ నిర్మించాడు.
లోకా చాప్టర్ 1 గురించి
{{/usCountry}}దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన లోకా చాప్టర్ 1- చంద్ర మూవీకి డొమినిక్ అరుణ్ రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరో పాత్రలో నటించింది. నాస్లెన్, చందు సలీంకుమార్, అరుణ్ కురియన్, శాండీ ముఖ్య పాత్రలు పోషించారు. 'లోకా చాప్టర్ 1' ఆగస్టు 28, 2025న థియేటర్లలో విడుదలైంది.