Love and War Alia Bhatt: బోల్డ్ అవతార్‌లో ఆలియా భట్.. లవ్ అండ్ వార్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. భర్తను మించిపోయి..

Love and War Alia Bhatt: ఆలియా భట్ బోల్డ్ లుక్ వైరల్ అవుతోంది. ఆమె తన భర్త రణ్‌బీర్ కపూర్ తో కలిసి నటిస్తున్న లవ్ అండ్ వార్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. ఒక రోజు ముందు రణ్‌బీర్ పోస్టర్ రాగా.. దానికి మించి ఆలియా పోస్టర్ ఆకట్టుకుంటోంది.

Published on: Sep 25, 2026, 15:41:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Love and War Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'లవ్ అండ్ వార్' నుంచి ఆలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఎన్నడూ చూడని అత్యంత గ్లామరస్ క్యాబరే అవతార్‌లో ఆలియా కనిపించడంతో నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు.

Love and War Alia Bhatt: బోల్డ్ అవతార్‌లో ఆలియా భట్.. లవ్ అండ్ వార్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. భర్తను మించిపోయి..
Love and War Alia Bhatt: బోల్డ్ అవతార్‌లో ఆలియా భట్.. లవ్ అండ్ వార్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. భర్తను మించిపోయి..

హాట్ క్యాబరే అవతార్‌లో ఆలియా భట్ విజువల్ వండర్

రణ్‌బీర్ కపూర్ ఇంటెన్స్ లుక్ వదిలి హైప్ పెంచిన మేకర్స్.. ఇప్పుడు ఆలియా భట్ పోస్టర్‌తో గ్రాండ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆలియా వైన్ రెడ్ సీక్విన్డ్ డ్రెస్, డ్రామాటిక్ హెడ్ పీస్, స్లిట్ స్కర్ట్ వేసుకుని చైర్‌పై కూర్చుని పర్ఫెక్ట్ క్యాబరే డ్యాన్సర్‌లా కనిపిస్తోంది.

రెట్రో మూడ్‌కి తగ్గట్లుగా బ్యాక్‌గ్రౌండ్‌లో రెడ్ కర్టెన్స్, మెరిసిపోయే లైటింగ్స్ తో సంజయ్ లీలా భన్సాలీ మార్క్ గ్రాండ్‌నెస్ క్లియర్‌గా కనిపిస్తోంది. "ఆగ్ భీ.. దిలోన్ కీ జాన్ భీ" అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ ఈ పోస్టర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనే చెప్పాలి.

పీరియడ్ డ్రామా కాకుండా... కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్న భన్సాలీ

సాధారణంగా సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు అంటే చారిత్రాత్మక పీరియడ్ సెట్టింగ్స్, రాచరికపు కోటలు గుర్తుకొస్తాయి. అయితే 'లవ్ అండ్ వార్' విషయంలో ఆయన రూట్ మార్చి ఒక మోడర్న్ కంటెంపరరీ వరల్డ్ క్రియేట్ చేస్తున్నట్లు టాక్.

ఆలియా భట్, సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'గంగూభాయి కాఠియావాడీ' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఆలియా నటనకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు మళ్లీ వీరి కాంబో రిపీట్ అవుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

రణ్‌బీర్, ఆలియా, విక్కీ కౌశల్... మైండ్ బ్లాకింగ్ కాంబినేషన్

ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌తో పాటు విక్కీ కౌశల్ కూడా లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ఇంటెన్స్ రొమాంటిక్ వార్ డ్రామాగా ఈ సినిమా రాబోతోందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

రణ్‌బీర్, విక్కీ గతంలో బ్లాక్‌బస్టర్ 'సంజు' సినిమాలో కలిసి నటించారు. అలాగే ఆలియా, విక్కీ 'రాజీ' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఈ ముగ్గురు పవర్ హౌస్ పెర్ఫార్మర్స్ ఒకే స్క్రీన్‌పై, అదీ భన్సాలీ డైరెక్షన్‌లో కనిపిస్తుండటం ఇదే తొలిసారి.

2027 సంక్రాంతి ధమాకా... పాన్ ఇండియా రిలీజ్

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పార్ట్ సక్సెస్ ఫుల్‌గా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ మ్యూజిక్ వర్క్ కోసం మేకర్స్ ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు.

ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా భారీ స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More