Sign in

Alia Bhatt Tumbbad 2: తుంబాడ్ 2 లోకి ఆలియా భట్ వైల్డ్ ఎంట్రీ.. ఫస్ట్ టైమ్ హారర్ థ్రిల్లర్.. రూ.100 కోట్లతో అదిరే ప్లాన్!

Alia Bhatt Tumbbad 2: ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ టెర్రిఫిక్ డార్క్ ఫాంటసీ హారర్ క్లాసిక్ మూవీ ‘తుంబాడ్’. దీని సీక్వెల్‌కు సంబంధించి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ క్రేజీ సినిమాలో బాలీవుడ్ టాప్ స్టార్ ఆలియా భట్ వైల్డ్ ఎంట్రీ ఇచ్చింది. దీన్ని రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

Published on: Jul 14, 2026, 11:23:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Alia Bhatt Tumbbad 2: సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత భయంకరమైన ‘హస్తార్’ ప్రపంచం మళ్లీ థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. 2018లో విడుదలైన ‘తుంబాడ్’ సృష్టించిన విజువల్ వండర్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘తుంబాడ్ 2’ లో అలియా భట్ వైల్డ్ ఎంట్రీ ఇచ్చింది.

తుంబాడ్ 2 లోకి ఆలియా భట్ వైల్డ్ ఎంట్రీ.. ఫస్ట్ టైమ్ హారర్ థ్రిల్లర్.. రూ.100 కోట్లతో అదిరే ప్లాన్! (x)
తుంబాడ్ 2 లోకి ఆలియా భట్ వైల్డ్ ఎంట్రీ.. ఫస్ట్ టైమ్ హారర్ థ్రిల్లర్.. రూ.100 కోట్లతో అదిరే ప్లాన్! (x)

అలియా భట్ ఎంట్రీ

సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్ తుంబాడ్ సీక్వెల్ తుంబాడ్ 2 నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో అలియా భట్ ఎంట్రీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. సినిమాను నిర్మించడంతో పాటు హీరోగా నటిస్తున్న సోహుమ్ షా ఈ ప్రకటన చేశాడు. అలియా భట్ ఫస్ట్ టైమ్ ఓ హారర్ థ్రిల్లర్ చేస్తోంది.

రూ.100 కోట్లతో

తుంబాడ్ మొదటి భాగాన్ని చాలా పరిమిత బడ్జెట్‌తో వర్షం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. కానీ ‘తుంబాడ్ 2’ ను ఏకంగా రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేశారు. ముంబైలో దాదాపు 8 ఎకరాల సువిశాల స్థలంలో ఒక భారీ నగరానికి సంబంధించిన సెట్‌ను కూడా పునఃసృష్టించారు.

అయితే, ఒక హారర్ ఫాంటసీ సినిమాపై రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టడం అనేది ట్రేడ్ పరంగా భారీ రిస్క్. ఇక్కడే సోహమ్ షా ఒక క్లెవర్ బిజినెస్ స్ట్రాటజీని ప్లే చేశాడని చెప్పొచ్చు.

పవర్ ఫుల్ క్యారెక్టర్

కేవలం నార్త్ ఆడియన్స్‌నే కాకుండా సౌత్ మార్కెట్‌ను కూడా కొల్లగొట్టడానికి ఆలియా భట్ లాంటి గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న నటి అవసరం. తుంబాడ్ 2 సినిమాలో ఆమెది కేవలం గెస్ట్ రోల్ కాదు, కథను పూర్తిగా మలుపు తిప్పే ఒక పవర్‌ఫుల్ డార్క్ క్యారెక్టర్‌ అని తెలుస్తోంది. దాదాపు 20 రోజుల పాటు అలియా ఈ మూవీ షూటింగ్ చేయబోతుంది.

ఇక వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ రాకతో ఈ సినిమాకు లభించే యాక్టింగ్ క్రెడిబిలిటీ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుంది. సోహమ్ షా (వినాయక్ రావు పాత్ర), నవాజ్ మధ్య వచ్చే మైండ్ గేమ్ సీన్స్ ఈ సీక్వెల్‌కు మేజర్ హైలైట్ కానున్నాయి.

రిలీజ్ డేట్

ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వంలో తుంబాడ్ 2 సినిమా షూటింగ్ ఇప్పటికే ఏప్రిల్ 7, 2026 న ప్రారంభమైంది. ‘ప్రళయ్ ఆయేగా’ (ప్రళయం వస్తుంది) అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ డార్క్ ఫాంటసీని డిసెంబర్ 3, 2027 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

రీ-రిలీజ్ సంచలనం!

2018లో తుంబాడ్ సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించినప్పటికీ, కమర్షియల్‌గా భారీ వసూళ్లను సాధించలేకపోయింది. కానీ ఓటీటీలోకి వచ్చాక ఈ సినిమా ఒక ‘కల్ట్ క్లాసిక్’గా అవతరించింది.

అనంతరం ఈ చిత్రాన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేయగా.. ఏకంగా రూ. 38 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. థియేట్రికల్ రన్‌లో వచ్చిన కలెక్షన్స్ కంటే.. రీ-రిలీజ్‌లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించడం ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డు. ఈ విపరీతమైన క్రేజ్‌ను చూశాకే మేకర్స్ ఈ చిత్రాన్ని ఒక ‘ట్రైలాజీ’ (3 భాగాల సిరీస్) గా మార్చాలని డిసైడ్ అయ్యారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More