...
...
Next Story

Nandini Reddy: సగం సినిమా చూసి ఆపేశా.. ఇప్పుడు డిలీట్ చేశారు: జీ5 ఓటీటీలో నిషేధం విధించిన సినిమాపై నందిని షాకింగ్ పోస్ట్

Nandini Reddy: జీ5 ఓటీటీలోకి వచ్చి రెండు రోజుల్లోనే నిషేధానికి గురైన సట్లెజ్ మూవీపై మా ఇంటి బంగారం డైరెక్టర్ నందిని రెడ్డి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ మూవీ సగం చూసి ఆపేశానని, ఇప్పుడు డిలీట్ చేశారని బాధపడింది.

Published on: Jul 6, 2026, 20:18:18 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Nandini Reddy: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి రీసెంట్ గా నెట్టింట ఒక సెన్సేషనల్ పోస్ట్ పెట్టి హాట్ టాపిక్ గా మారారు. దిల్జిత్ దోసాంజ్ లీడ్ రోల్లో నటించిన రియల్ లైఫ్ హార్డ్ హిట్టింగ్ మూవీ 'సట్లెజ్' (Satluj) ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) సడెన్ గా డిలీట్ చేయడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమంత 'మా ఇంటి బంగారం' తో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టిన ఈ క్రియేటివ్ డైరెక్టర్.. ఇప్పుడు పంజాబ్ పాలిటిక్స్ బేస్డ్ మూవీకి సపోర్ట్ గా నిలబడటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఆ బాధ తట్టుకోలేక బ్రేక్ తీసుకున్నా

Nandini Reddy: సగం సినిమా చూసి ఆపేశా.. ఇప్పుడు డిలీట్ చేశారు: జీ5 ఓటీటీలో నిషేధం విధించిన సినిమాపై నందిని షాకింగ్ పోస్ట్
Nandini Reddy: సగం సినిమా చూసి ఆపేశా.. ఇప్పుడు డిలీట్ చేశారు: జీ5 ఓటీటీలో నిషేధం విధించిన సినిమాపై నందిని షాకింగ్ పోస్ట్

హనీ ట్రెహాన్ డైరెక్షన్ లో వచ్చిన సట్లెజ్ సినిమాను మొదట 'పంజాబ్ 95' టైటిల్ తో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఎన్నో అడ్డంకులు దాటి 'సట్లెజ్' పేరుతో జీ5 ఓటీటీలో రిలీజ్ చేశారు. కానీ స్ట్రీమింగ్ కి వచ్చిన రెండు రోజులకే ఈ మూవీని ఇండియాలో బ్యాన్ చేస్తూ యాప్ నుంచి తీసేశారు. కరెక్ట్ గా ఇదే ఇష్యూ మీద నందిని రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఫైర్ అయ్యారు.

సట్లెజ్ సినిమా చూస్తున్నప్పుడు అందులోని రియల్ లైఫ్ ఎమోషన్స్ తనను బాగా డిస్టర్బ్ చేశాయని నందిని చెప్పారు. "అద్భుతమైన ఈ సినిమాను చూడటం మొదలుపెట్టా.. కానీ అందులోని నిజాలు చూసి తట్టుకోలేక చివరి 30 నిమిషాల ముందు బ్రేక్ తీసుకున్నాను. మరుసటి రోజు చూద్దాం అనుకునేలోపే ఆ సినిమాను బ్యాన్ చేశారు. ఆ రోజే సినిమా మొత్తం చూసుంటే బాగుండేది కదా అనిపిస్తోంది" అని ఆమె ఎమోషనల్ గా రాసుకొచ్చారు.

దేశంలో అసలు స్వేచ్ఛ ఉందా? డైరెక్టర్ సూటి ప్రశ్న

ఇండియాలో ఆన్‌లైన్ లో బ్యాన్ చేసినా, పంజాబ్ లోని పబ్లిక్ ప్లేసుల్లో ఈ సినిమాను జనాలు పెద్ద స్క్రీన్స్ మీద చూస్తున్న వీడియోలను నందిని రెడ్డి షేర్ చేశారు. దిల్జిత్, సువిందర్ విక్కీ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ అని నెటిజన్లు పెట్టిన రివ్యూలను కూడా ఆమె తన ప్రొఫైల్ లో రీ-పోస్ట్ చేశారు. సినిమాను బ్యాన్ చేయకముందే అందరూ వెంటనే చూడాలంటూ నెటిజన్లు పెట్టిన ముందస్తు వార్నింగ్స్ అన్నీ ఇప్పుడు నిజమయ్యాయి.

సట్లెజ్ మూవీ తీసేసిన తర్వాత జీ5 కూడా ఒక అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మూవీ ఇండియాలో అందుబాటులో ఉండదని, త్వరలోనే లీగల్ గా మళ్లీ ఆడియన్స్ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని క్లారిటీ ఇచ్చింది. అలాగే సోషల్ మీడియాలో ఈ మూవీ పైరసీ కాపీలు తిరుగుతుండటంపై స్పందిస్తూ.. దయచేసి పైరసీని ప్రోత్సహించొద్దని జనాలకు విజ్ఞప్తి చేసింది.

కానీ హీరో దిల్జిత్ దోసాంజ్ మాత్రం రిలీజ్ రోజే ఈ బ్యాన్ గురించి ముందే ఊహించాడు. సినిమా తీసేసిన తర్వాత జనాలు ఎక్కడినుంచైనా సరే డౌన్‌లోడ్ చేసుకుని చూడమని ఫ్యాన్స్ కు చెప్పడం పెద్ద సెన్సేషన్ గా మారింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖాల్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. పంజాబ్ పాలిటిక్స్ లో పోలీసులు ఫేక్ ఎన్ కౌంటర్స్ చేసి, సుమారు 25 వేల మందిని అక్రమంగా దహనం చేశారనే ఆరోపణల వెనుక ఉన్న చీకటి నిజాలను ఆయన బయటపెట్టారు. ఇదే పాయింట్ చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది.

సట్లెజ్ మూవీపై నందిని రెడ్డి ఇన్‌స్టాలో చేసిన పోస్ట్
 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks