Maa Inti Bangaram Review:

సినిమా పేరు : మా ఇంటి బంగారం
నటీనటులు : సమంత రూత్ ప్రభు, గుల్షన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి, దిగంత్ మంచాలే, గవిరెడ్డి శ్రీనివాస్, మంజూష తదితరులు
డైరెక్టర్ : బీవీ నందిని రెడ్డి
మ్యూజిక్ : సంతోష్ నారాయణన్
ప్రొడ్యూసర్లు : సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు
రిలీజ్ డేట్ : జూన్ 19, 2026
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న క్రేజీ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ‘మా ఇంటి బంగారం’. మూడేళ్ల తర్వాత తెలుగులో హీరోయిన్ గా సామ్ చేసిన మూవీ ఇది. ఇందులో ఆమె యాక్షన్ తోనూ అదరగొట్టిందని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి మా ఇంటి బంగారం మూవీ ఎలా ఉంది? సమంత్ కు మంచి కమ్ బ్యాక్ ఇచ్చిందా? అన్నది రివ్యూలో చూద్దాం.
కథేంటంటే?
అనిరుధ్ (దిగ్నాంత్ మంచాలే) తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా స్వర్ణ (సమంత)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఈ కారణంగా మూడేళ్లపాటు తన సొంత కుటుంబానికి దూరంగా ఉంటాడు. అయితే, తన చెల్లెలి పెళ్లి కోసం భార్య స్వర్ణను తీసుకుని ఎట్టకేలకు తన సొంత ఊరికి తిరిగి వస్తాడు.
కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. ఆ గ్రామానికి వెళ్లే దారిలో ఒక అపరిచిత వ్యక్తి స్వర్ణను చూసి షాక్‌కు గురవుతాడు. ఆమె సరిగ్గా 'ఝాన్సీ' లాగే ఉందే అని అనుమానిస్తాడు. అత్తారింటికి వెళ్లిన స్వర్ణ అక్కడ ఉత్తమ కోడలిగా పేరు తెచ్చుకునేందుకు నానా పాట్లు పడుతుంది. అసలు స్వర్ణ ఎవరు? ఝాన్సీ ఎవరు?మాజీ నక్సలైట్ నాయకుడు కరుణ (గుల్షన్ దేవయ్య)తో ఝాన్సీకి ఉన్న శత్రుత్వం ఏంటి? కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం స్వర్ణ ఏం చేసిందన్నదే ‘మా ఇంటి బంగారం’ అసలు కథ.
విశ్లేషణ
{{/usCountry}}కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. ఆ గ్రామానికి వెళ్లే దారిలో ఒక అపరిచిత వ్యక్తి స్వర్ణను చూసి షాక్‌కు గురవుతాడు. ఆమె సరిగ్గా 'ఝాన్సీ' లాగే ఉందే అని అనుమానిస్తాడు. అత్తారింటికి వెళ్లిన స్వర్ణ అక్కడ ఉత్తమ కోడలిగా పేరు తెచ్చుకునేందుకు నానా పాట్లు పడుతుంది. అసలు స్వర్ణ ఎవరు? ఝాన్సీ ఎవరు?మాజీ నక్సలైట్ నాయకుడు కరుణ (గుల్షన్ దేవయ్య)తో ఝాన్సీకి ఉన్న శత్రుత్వం ఏంటి? కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం స్వర్ణ ఏం చేసిందన్నదే ‘మా ఇంటి బంగారం’ అసలు కథ.
విశ్లేషణ
{{/usCountry}}అమాయకురాలైన కోడలిగా అత్తారింట్లో స్వర్ణ అడుగుపెట్టడంతో స్టోరీ ముందుకు సాగుతుంది. ఒక క్యూట్ అండ్ ఇన్నోసెంట్ ఫ్యామిలీ డ్రామాను సిట్యుయేషనల్ కామెడీతో అద్భుతంగా మిక్స్ చేశారు. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ ముందు వరకు కథనం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. తోడి కోడలు శ్రీముఖి కంటే బెటర్ అనిపించుకోవడం స్వర్ణ పడే తిప్పలు నవ్విస్తాయి. వీళ్ల మధ్య వచ్చే సీన్స్ బాగా పేలాయి.
ఈ రోజుల్లో కేవలం సోషల్ మీడియా మీమ్స్, స్పూఫ్‌లనే కామెడీగా వాడుతున్నారు. అలాంటిది నందిని రెడ్డి, ఆమె రైటింగ్ టీమ్ క్లీన్ అండ్ ఒరిజినల్ హ్యూమర్‌ను నమ్ముకోవడం అభినందనీయం. ఫస్టాఫ్‌లో వచ్చే ఆర్గానిక్ కామెడీ, లీడ్ క్యారెక్టర్ ఫ్లాష్‌బ్యాక్ పై క్రియేట్ చేసిన సస్పెన్స్, సమంత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను స్క్రీన్‌కు కట్టిపడేస్తాయి.
దర్శకురాలు నందిని రెడ్డి ఫస్టాఫ్‌లో క్యూరియాసిటీని బాగా బిల్డ్ చేశారు. మరోవైపు యాక్షన్ సీక్వెన్స్ లో ముఖ్యంగా బస్సులో వచ్చే ఫైట్, టెంపుల్ యాక్షన్ సీన్, క్లైమాక్స్ ఫైట్ థియేటర్లలో చప్పట్లు కొట్టిస్తాయి. సమంత ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం పడిన కష్టం ప్రతి సీన్ లోనూ కనిపిస్తుంది. రాయలసీమ డైలాగ్ డెలివరీ ఎక్కడా ఆర్టిఫిషియల్‌గా లేదు.
అయితే, కథ సెకండాఫ్ కు వచ్చేసరికి తన ఫ్రెష్‌నెస్‌ను కోల్పోతుంది. ఫస్టాఫ్‌లో లీడ్ క్యారెక్టర్ ఏదో పెద్ద మిషన్‌లో ఉన్న అండర్ కవర్ ఏజెంట్ లేదా స్పై అనే రేంజ్‌లో సస్పెన్స్ బిల్డ్ చేశారు. కానీ తీరా చూస్తే, అదొక రొటీన్ విలన్ వర్సెస్ పవర్‌ఫుల్ విమెన్ డ్రామాగా మారిపోతుంది. ఒక స్త్రీపై పురుషుడికి ఉన్న మోహం లేదా వ్యామోహం అనే పాయింట్ చుట్టూనే సెకండాఫ్ రన్ అవ్వడం వల్ల స్క్రీన్‌ప్లేలో ట్విస్టులకు స్కోప్ లేకుండా పోయింది. ట్విస్ట్ లు కూడా తక్కువే. సెకండాఫ్ ఇంకా బెటర్ తీసి ఉంటే ఈ మూవీ మరో రేంజ్ లో ఉండేది.
ఎవరెలా చేశారంటే?
ఈ సినిమా పూర్తిగా సమంత వన్ విమెన్ షో. స్వర్ణగా అమాయకమైన ఆదర్శ కోడలి పాత్రలో ఎంతటి క్లీన్ సిట్యుయేషనల్ కామెడీ పండించిందో.. ఝాన్సీగా అంతటి భీభత్సమైన మాస్ యాక్షన్ ఎపిసోడ్స్‌లో పూనకాలు తెప్పించింది. ముఖ్యంగా బస్సులో యాక్షన్ సీన్లలో సమంత పడిన కష్టం, ఆమె బాడీ లాంగ్వేజ్ థియేటర్లలో మాస్ ఆడియన్స్‌తో విజిల్స్ వేయిస్తాయి.
బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ గుల్షన్ దేవయ్య విలన్ 'కరుణ' పాత్రలో అద్భుతమైన రస్టిక్ విలనిజం పండించాడు. కానీ ఆయన క్యారెక్టర్‌ను సెకండాఫ్‌లో ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. ఇక పుస్తకాల్లో ఉండే పద్ధతైన ఆదర్శ కోడలిగా యాంకర్ శ్రీముఖి కనిపించిన ప్రతిసారీ థియేటర్లలో నవ్వులు పూశాయి.
టెక్నికల్ టీమ్
సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు అతిపెద్ద పిల్లర్. రొటీన్ మాస్ సినిమాల్లా లౌడ్‌గా, చెవులు పగిలిపోయేలా కాకుండా.. సీన్లలోని ఇంటెన్సిటీని పెంచుతూ హాలీవుడ్ యాక్షన్ సినిమాల రేంజ్ ఫీల్ తెచ్చాడు. ఆల్రెడీ చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘తస్సాదియా’ సాంగ్ విజువల్స్ స్క్రీన్ పై అద్భుతంగా ఉన్నాయి. ఓం ప్రకాష్ తన కెమెరా పనితనంతో పరిమిత బడ్జెట్ లోనే సినిమాను చాలా స్టైలిష్‌గా, రిచ్ విజువల్స్‌తో ప్రెజెంట్ చేశారు.
ఫైనల్ గా
నటన పరంగా సమంతకు మా ఇంటి బంగారం మంచి కమ్ బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఆ రేంజ్ లో లేదు. సెకండాఫ్ ఇంకాస్త బెటర్ గా ఉండే మూవీ వేరే లెవల్ లో ఉండేది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ జనాలు, సమంత ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే మూవీ ఇది.