...
...
Next Story

OTT Telugu: దూరమైన పిల్లల కోసం మిలియనీర్ ఆరాటం.. ఇవాళ ఓటీటీలోకి తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా.. సుమన్, ఆమని కాంబినేషన్

OTT Telugu: ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఇవాళ ఓటీటీలో అడుగుపెట్టింది. దూరమైన పిల్లలను తిరిగి కలవాలనుకునే మిలియనీర్ కథ ఇది. ఇందులో సీనియర్ నటీనటులు సుమన్, ఆమని జంటగా నటించారు.

Published on: Mar 29, 2026, 05:53:06 IST
Advertisement

సండే స్పెషల్ గా ఓటీటీలోకి ఓ కొత్త సినిమా డైరెక్ట్ గా వచ్చేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తెలిపేలా ఉన్న మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది. ‘మా నాన్న కథ’ చిత్రం ఇవాళ (మార్చి 29) నుంచి ఓటీటీ ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది. సీనియర్ హీరో హీరోయిన్లు సుమన్, ఆమని ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు.

మా నాన్న కథ ఓటీటీ

ఓటీటీలోకి తెలుగు సినిమా (x/etv win)
ఓటీటీలోకి తెలుగు సినిమా (x/etv win)

ఓటీటీలో ఎప్పటికప్పుడూ డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ లతో, వేర్వేరు జోనర్లలో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ‘మా నాన్న కథ’ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఆదివారం నేరుగా ఈ మా నాన్న కథ మూవీ రిలీజ్ అయింది.

కథాసుధ

ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ కథాసుధ వీక్లీ సిరీస్ లో భాగంగా ప్రతి ఆదివారం ఒక చిన్న సినిమాను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఈ రోజు ‘మా నాన్న కథ’ అనే సినిమా డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. మిలియనీర్ అయిన తండ్రి తన పిల్లలను తిరిగి చేరుకోవడానికి పడే ఆరాటాన్ని ఈ సినిమాలో చూపించారు.

సుమన్, ఆమని

ఒకప్పుడు తెలుగు వెండితెరపై అదరగొట్టిన సీనియర్ హీరో హీరోయిన్లు సుమన్, ఆమని ఈ ‘మా నాన్న కథ’ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ షార్ట్ ఫిల్మ్ లో సుమన్, ఆమనితో పాటు సన్నీ అఖిల్, కేత్న రాజ్, శ్రీనివాస్ భోగిరెడ్డి, సందీప్ దేవ్ తదితరులు నటించారు.

ఇది ఓ మిలియనీర్ తండ్రి కథ. మనసును తాకే ఎమోషన్స్ తో తీర్చిదిద్దిన సినిమా మా నాన్న కథ. ఇందులో సుమన్, ఆమని భార్యాభర్తలుగా నటించారు. సుమన్ ఓ మిలియనీర్. బాగా డబ్బున్న వ్యక్తి. కానీ కొన్ని కారణాల వల్ల సుమన్, ఆమని విడిపోతారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు.

భార్య నుంచి విడిపోయిన సుమన్ తన పిల్లలను తిరిగి కలవాలని అనుకుంటాడు. మరి ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు ఏంటీ? సుమన్, ఆమని హాస్పిటల్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అన్నది మా నాన్న కథ మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks