Prabhas Biker: డార్లింగ్ మంచి మనసు.. శర్వానంద్ బైక‌ర్‌కు ప్ర‌భాస్ స‌పోర్ట్‌.. పోస్ట్ వైర‌ల్

Prabhas Biker: డార్లింగ్ అంటే అంతే.. తన సినిమాలనైనా ప్రమోట్ చేస్తాడో లేదో కానీ వేరే వాళ్ల మూవీస్ ను మాత్రం ఎంకరేజ్ చేస్తాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ పై ఇలాంటి కామెంట్లే వస్తున్నాయి. శర్వానంద్ బైకర్ మూవీ కోసం ప్రభాస్ పోస్ట్ పెట్టడమే ఇందుకు కారణం.

Published on: Mar 23, 2026, 13:37:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శర్వానంద్ అప్ కమింగ్ మూవీ ‘బైకర్’. ఇది బైక్ రేసింగ్ చుట్టూ సాగే కథతో తెరకెక్కిన సినిమా. ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ మూవీగా థియేటర్లకు రాబోతున్న బైకర్ చిత్రం ట్రైలర్ ను ఆదివారం (మార్చి 22) రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సపోర్ట్ గా ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం వైరల్ గా మారింది.

బైకర్ కు ప్రభాస్ సపోర్ట్ (x/ImSharwanand)
బైకర్ కు ప్రభాస్ సపోర్ట్ (x/ImSharwanand)

ప్రభాస్ సపోర్ట్

శర్వానంద్ హిరోగా నటించిన బైకర్ మూవీకి ప్రభాస్ సపోర్ట్ గా నిలిచారు. బైకర్ ట్రైలర్ ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ప్రభాస్ షేర్ చేశాడు. ‘‘ట్రైలర్ వైబ్ నాకెంతో నచ్చింది. చాలా ఎంగేజింగ్ గా కనిపిస్తుంది. శర్వానంద్ కు, యూవీ క్రియేషన్స్ కు, మొత్తం బైకర్ టీమ్ కు బెస్ట్ విషెస్. ఏప్రిల్ 3న బిగ్ సక్సెస్ దక్కాలని కోరుకుంటున్నా’’ అని ప్రభాస్ పోస్టు చేశాడు.

శర్వా థ్యాంక్స్

బైకర్ ట్రైలర్ పోస్టు చేసి, సపోర్ట్ చేసిన ప్రభాస్ కు శర్వానంద్ థ్యాంక్స్ చెప్పాడు. ‘‘చాలా థ్యాంక్స్ ప్రభాస్ అన్న. మాకు ఇదెంతో ముఖ్యమైంది. ఇప్పుడు మేం మరింత ఛార్జ్ అయ్యాం. డాల్సీ సినిమా, ఎపిక్, 4డీఎక్స్, పీసీఎక్స్ లో ఇండియా ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్ ను ఎంజాయ్ చేయండి. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ్, మలయాళంలో బైకర్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది’’ అని శర్వానంద్ పోస్టు చేశాడు.

డార్లింగ్ అంటే అంతే

బైకర్ సినిమాకు ప్రభాస్ సపోర్ట్ చేయడంతో అతని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘‘తన సినిమా తప్ప అందరి సినిమాలు ప్రమోట్ చేస్తాడు.. మా డార్లింగ్ బంగారం’’ అని ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. ‘‘రాజు గారు తన సినిమా అప్ డేట్స్ కంటే కూడా వేరేవాళ్ల అప్ డేట్స్ ఇస్తాడు’’ అని మరో యూజర్ పేర్కొన్నాడు.

బైకర్ గురించి

శర్వానంద్ హీరోగా నటించిన రేసింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘బైకర్’. ఈ మూవీ ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి డైరెక్టర్. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించాడు. శర్వానంద్ కు తండ్రిగా, మెంటార్ గా నటించాడు.

నారీ నారీ నడుమ మురారి సినిమాతో సంక్రాంతి 2026కు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శర్వానంద్, ఇప్పుడు బైకర్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. బంపర్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నానని ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో చెప్పాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More