OTT Trending: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ లేపుతున్న సౌత్ ఇండియా మూవీ.. ధురంధర్, బోర్డర్ 2 రికార్డులు ఔట్.. వరుసగా రెండో వారం
OTT Trending: ప్రియాంక మోహన్ లీడ్ రోల్ ప్లే చేసిన 'మేడ్ ఇన్ కొరియా' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ లేపుతోంది. ఈ సౌత్ ఇండియన్ సినిమా వరుసగా రెండో వారం కూడా గ్లోబల్ లెవల్లో అదరగొట్టింది. నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో నంబర్ వన్ గా ఈ తమిళ్ మూవీ నిలిచింది.
ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన 'మేడ్ ఇన్ కొరియా' గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు డిజిటల్ ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ దక్కుతోంది. వరుసగా రెండో వారం కూడా నాన్-ఇంగ్లీష్ చిత్రాల విభాగంలో మేడ్ ఇన్ కొరియా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

మేడ్ ఇన్ కొరియా ఓటీటీ
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 12న మేడ్ ఇన్ కొరియా డైరెక్ట్ గా రిలీజైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన 'ధురంధర్', 'బోర్డర్ 2' వంటి సినిమాలను డిజిటల్ స్ట్రీమింగ్ లో మేడ్ ఇన్ కొరియా వెనక్కి నెట్టడం విశేషం.
వ్యూస్ ఇలా
మేడ్ ఇన్ కొరియా మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. మార్చి 16 నుంచి 22 వరకు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా 67 లక్షలకు పైగా వ్యూస్ సాధించి టాప్‌లో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న 'బోర్డర్ 2' కేవలం 33 లక్షల వ్యూస్ మాత్రమే రాబట్టగలిగింది. అలాగే 23 లక్షల వ్యూస్ పొందిన 'ధురంధర్' మూడో స్థానానికి పరిమితమైంది.

సౌత్ ఇండియన్ మూవీ
నెట్‌ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాల లిస్ట్ లో ఓ సౌత్ ఇండియన్ మూవీ అయిన మేడ్ ఇన్ కొరియా ఈ స్థాయిలో డామినెన్స్ ప్రదర్శించడం విశేషం. ఈ చిత్ర దర్శకుడు రా కార్తీక్ ఈ విజయంపై సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు.
ప్రియాంకపై ప్రశంసల వర్షం
మేడ్ ఇన్ కొరియా సినిమాలో షెన్బాగం పాత్రలో ప్రియాంక మోహన్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో ఆమె రోజుకు 12 గంటల పాటు కష్టపడి పనిచేసిందని దర్శకుడు రా కార్తీక్ వెల్లడించారు. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా ఇంత పెద్ద హిట్ కావడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రియాంక అంకితభావం, నిబద్ధత వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైందని చిత్ర యూనిట్ కొనియాడుతోంది. తనకు వస్తున్న సందేశాలు, కాల్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని కార్తీక్ తెలిపారు.
మేడ్ ఇన్ కొరియా కథా నేపథ్యం
తమిళనాడులోని కొలాప్పూర్ అనే చిన్న గ్రామానికి చెందిన షెన్బాగం అనే అమ్మాయి కథ ఇది. ఏదో ఒక రోజు కొరియాను చూడాలని ఆమె కలలు కంటూ ఉంటుంది. తన ప్రియుడు మణితో కలిసి వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయినా, ఆమె ఒంటరిగానే దక్షిణ కొరియాలోని సియోల్ కు వెళ్తుంది.
అక్కడ ఎదురైన సవాళ్లను దాటుకుని ఆమె తన కలలను ఎలా నిజం చేసుకుంది అనే అంశాన్ని దర్శకుడు చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. బేక్ సి-హూన్, పార్క్ హై-జిన్ వంటి కొరియన్ నటీనటుల నటన సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


