బాలీవుడ్‌లో ఈమధ్యే విడుదలైన రణ్‌వీర్ సింగ్ మూవీ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో, రివ్యూలలో మాత్రం మిశ్రమ స్పందనను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సినిమాలోని హింస, నిడివిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ నెగటివ్ రివ్యూలను చూసి తాను ఏమాత్రం ఆశ్చర్యపోలేదని నటుడు ఆర్. మాధవన్ అన్నాడు. తన కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ హిట్స్ అయిన 'రంగ్ దే బసంతి', 'త్రీ ఇడియట్స్' సినిమాలకు కూడా మొదట్లో ఇలాంటి పరిస్థితే ఎదురైందని అతడు గుర్తు చేశాడు.
"త్రీ ఇడియట్స్, రంగ్ దే బసంతి సినిమాలకు కూడా.."

పూజా తల్వార్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ.. సినిమా విడుదల కాకముందే ఇలాంటి స్పందన వస్తుందని తాను ఊహించానని చెప్పారు.
"సమాజంపై ప్రభావం చూపించే సినిమాలకు ఇలా జరగడం సహజం. మొదట్లో చాలా మంది చెత్త రేటింగ్స్ ఇస్తారు. 'రంగ్ దే బసంతి', 'త్రీ ఇడియట్స్' సినిమాలకు కూడా అలాగే జరిగింది. అప్పుడు ఆ సినిమాలకు '2 రేటింగ్' ఇచ్చిన వాళ్లు ఇప్పుడు కనిపించకుండా పోయారు. కానీ మేము ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నాం. ఇది నేను కోపంతో అనడం లేదు.. కేవలం పాయింట్ మిస్ అవుతున్నారని చెబుతున్నాను. మారాల్సిన సమయం వచ్చింది" అని మాధవన్ వ్యాఖ్యానించారు.
'రంగ్ దే బసంతి' సినిమా సమయంలో డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గారని, మీడియా అది ప్లాప్ అవుతుందని ముందే రాసేసిందని, కానీ చివరికి అది చరిత్ర సృష్టించిందని అతడు గుర్తు చేశాడు.
యూట్యూబ్ రివ్యూయర్లపై అసహనం
సినిమా సందర్భాన్ని, ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోకుండా.. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో 'డిజాస్టర్' అంటూ ముద్రవేసే వారిని మాధవన్ తప్పుబట్టాడు.
"ఇలాంటి పరిస్థితులు వస్తాయని నటులుగా మేము ముందే ఊహిస్తాం. అందరూ సినిమా చెత్తగా ఉందంటారు.. కానీ ఆ తర్వాత అది బ్లాక్‌బస్టర్ అవుతుంది. 'ధురంధర్' విషయంలో ఇది జరిగినప్పుడు.. నాకు పాత రోజులు గుర్తొచ్చాయి" అని మాధవన్ ధీమా వ్యక్తం చేశాడు. సినిమా విలువ అనేది అది ఎన్నో రోజుల పాటు చూపించే ప్రభావం మీద ఆధారపడి ఉంటుందే తప్ప, ఆన్‌లైన్ రివ్యూల మీద కాదని తేల్చి చెప్పాడు.
బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్' జోరు
విమర్శలు ఎలా ఉన్నా, రణ్‌వీర్ సింగ్ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. మొదటి వారంలోనే రూ. 200 కోట్ల మార్క్ దాటింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, ఈ ఏడాది అత్యంత విజయవంతమైన హిందీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
{{/usCountry}}విమర్శలు ఎలా ఉన్నా, రణ్‌వీర్ సింగ్ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. మొదటి వారంలోనే రూ. 200 కోట్ల మార్క్ దాటింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, ఈ ఏడాది అత్యంత విజయవంతమైన హిందీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
{{/usCountry}}తాజాగా అల్లు అర్జున్ కూడా ఈ సినిమాకు రివ్యూ ఇచ్చాడు. ఇదో అద్భుతమైన సినిమా అని, తప్పకుండా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండని ఎక్స్ వేదికగా చెప్పడం విశేషం.