1990వ దశకంలో టాప్ హీరోయిన్లుగా వెలుగొందిన శ్రీదేవి, మాధురీ దీక్షిత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేదని, వారిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉండేదని అప్పట్లో విపరీతమైన రూమర్స్ ఉండేవి. ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ వార్తలపై మాధురీ దీక్షిత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన థ్రిల్లర్ వెబ్ సిరీస్ మిసెస్ దేశ్‌పాండే ఈ మధ్యే జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే.
శ్రీదేవితో పోటీపై మాధురి ఏమన్నదంటే?

బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల మధ్య పోటీ మామూలుగా ఉండేది కాదు. ముఖ్యంగా శ్రీదేవి, మాధురీ దీక్షిత్ మధ్య గట్టి పోటీ ఉండేది. వీరిద్దరి మధ్య మాటలు లేవని ప్రచారం జరిగేది. తాజాగా 'జూమ్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధురీ దీనిపై స్పందించింది.
"మా ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి గౌరవం లేకపోవడానికి అసలు కారణమే లేదు. ఆమె తన కెరీర్‌లో ఎంతో కష్టపడి పైకి వచ్చారు.. నేను కూడా అంతే కష్టపడ్డాను. మా ఇద్దరికీ ఆ విషయం (కష్టం విలువ) బాగా తెలుసు. అందుకే మా మధ్య గౌరవం ఎప్పుడూ ఉండేది" అని మాధురీ చెప్పుకొచ్చింది. తమ మధ్య మనస్పర్ధలు ఉన్నాయన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెపపింది.
శ్రీదేవి పాత్రను మాధురీ చేసినప్పుడు..
వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవనడానికి ఒక ఉదాహరణ 'కళంక్' (Kalank) సినిమా. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాలో మొదట శ్రీదేవి ఒక కీలక పాత్ర చేయాల్సి ఉంది. కానీ 2018లో శ్రీదేవి అకాల మరణంతో.. ఆ పాత్రను మాధురీ దీక్షిత్ పోషించింది.
అప్పట్లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ స్పందిస్తూ.. "ఈ సినిమా అమ్మ మనసుకు చాలా దగ్గరైనది. అమ్మ లేని లోటును తీరుస్తూ ఈ పాత్ర చేస్తున్నందుకు మాధురీ గారికి మా నాన్న (బోనీ కపూర్), ఖుషీ, నేను రుణపడి ఉంటాం" అని ఎమోషనల్ అయింది.
మాధురీ లేటెస్ట్ వెబ్ సిరీస్
{{/usCountry}}అప్పట్లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ స్పందిస్తూ.. "ఈ సినిమా అమ్మ మనసుకు చాలా దగ్గరైనది. అమ్మ లేని లోటును తీరుస్తూ ఈ పాత్ర చేస్తున్నందుకు మాధురీ గారికి మా నాన్న (బోనీ కపూర్), ఖుషీ, నేను రుణపడి ఉంటాం" అని ఎమోషనల్ అయింది.
మాధురీ లేటెస్ట్ వెబ్ సిరీస్
{{/usCountry}}మాధురీ దీక్షిత్ ప్రస్తుతం 'మిసెస్ దేశ్‌పాండే' (Mrs. Deshpande) అనే వెబ్ సిరీస్‌తో ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె జైలు ఖైదీగా నటిస్తూ, ఒక మర్డర్ మిస్టరీని ఛేదించడంలో పోలీసులకు సహాయం చేసే పాత్రలో కనిపించింది. ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
అతిలోక సుందరి శ్రీదేవి 2018, ఫిబ్రవరి 24న దుబాయ్‌లో మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి తెలుగుతోపాటు 1990ల్లో బాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆమె చివరిగా మామ్ అనే సినిమాలో కనిపించింది.