...
...
Next Story

ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. సీరియల్ కిల్లర్‌గా వస్తున్న మాధురీ దీక్షిత్

ఓటీటీలోకి మరో సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ఇందులో ఓ సీరియల్ కిల్లర్ గా బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ తిరిగి వస్తోంది. దీని గురించి ఓ చిన్న వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Published on: Nov 19, 2025, 21:50:04 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ రాబోయే జియోహాట్‌స్టార్ వెబ్ సిరీస్ ‘మిసెస్ దేశ్‌పాండే’తో మరోసారి బుల్లితెరపైకి తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. ఈ మధ్యే ఆమె ఓ చిన్న టీజర్ ను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఇది ఎవరూ ఊహించని ఓ ట్విస్టుతో ఆసక్తి రేపుతోంది.

'మిసెస్ దేశ్‌పాండే'గా మాధురి రీఎంట్రీ

ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. సీరియల్ కిల్లర్‌గా వస్తున్న మాధురీ దీక్షిత్ (PTI)
ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. సీరియల్ కిల్లర్‌గా వస్తున్న మాధురీ దీక్షిత్ (PTI)

బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ ఓ సీరియల్ కిల్లర్ పాత్రలో ఓటీటీలోకి వస్తోంది. బుధవారం (నవంబర్ 19) నాడు మాధురి తన సోషల్ మీడియాలో 20 సెకన్ల టీజర్‌ను షేర్ చేసింది. ఈ క్లిప్‌లో మాధురి తన నగలు, మేకప్ ను తొలగిస్తూ కనిపిస్తుంది.

అయితే ఈ సీన్ అకస్మాత్తుగా ఆగిపోయి.. ఆమె జైలు యూనిఫాంలో, నవ్వుతూ ఉండే భయానక సీన్ తెరపైన కనిపిస్తుంది. ఈ టీజర్ మాధురీ దీక్షిత్ ను భయపెట్టే సీరియల్ కిల్లర్ గా, ఓ బోల్డ్ అవతార్‌లో చూపిస్తుంది. ఇది ఆమె కెరీర్‌లోనే ప్రత్యేకమైన పాత్రగా నిలవనుంది.

అభిమానుల రియాక్షన్ ఇలా

అంతకుముందు రోజు మాధురీ దీక్షిత్ తన ఐకానిక్ పాటల నుండి మార్చిన సాహిత్యం ఉన్న క్యాప్షన్‌తో ఒక సీక్రెట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను షేర్ చేసింది. "త్వరలో రాబోతోంది" అనే క్యాప్షన్‌తో అభిమానులలో ఉత్సాహాన్ని పెంచింది.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఐఫా అవార్డ్స్ వేడుకలో మాధురీ దీక్షిత్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర తాను చేయలేదని, తనలోని భిన్నమైన కోణాన్ని ఈ పాత్ర చూపించనుందని చెప్పింది. అందుకే తాను ఈ పాత్ర చేయాలని అనుకున్నానని, దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపింది.

ఫ్రెంచ్ సిరీస్ ఆధారంగా 'మిసెస్ దేశ్‌పాండే'

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks