గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పూలదండలు అమ్ముతూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ఇండోర్ అమ్మాయి మోనాలిసా భోంస్లే (మోనీ) ఎట్టకేలకు తన ప్రేమను గెలిపించుకుంది. తన ప్రియుడు, మహారాష్ట్రకు చెందిన నటుడు ఫర్మాన్ ఖాన్‌ను ఆమె బుధవారం (మార్చి 11) కేరళలోని ఒక ఆలయంలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. భిన్న మతాలకు చెందిన వీరి వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఫేస్‌బుక్ స్నేహం.. కేరళలో పెళ్లి

మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా, మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్‌లకు ఏడాదిన్నర క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే వీరి మతాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
మోనాలిసా తండ్రి జైసింగ్ భోంస్లే ఆమెను వేరే వ్యక్తితో వివాహం చేయాలని ఒత్తిడి చేయడమే కాకుండా, ఆమె మలయాళ మూవీ 'నాగమ్మ' షూటింగ్ కోసం కేరళ వచ్చినప్పుడు బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశాడు.
దీంతో ఈ జంట రక్షణ కోసం కేరళ పోలీసులను ఆశ్రయించింది. మోనాలిసా మేజర్ కావడంతో ఆమెకు నచ్చిన వ్యక్తితో ఉండే హక్కు ఉందని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో తిరువనంతపురంలోని అరుమనూర్ ఆలయం వీరి వివాహానికి వేదికైంది.
'ఇదే అసలైన కేరళ స్టోరీ'
ఈ మతాంతర వివాహానికి కేరళ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్, రాజ్యసభ ఎంపీ ఏఏ రహీమ్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శివన్‌కుట్టి మాట్లాడుతూ.. "ఇదే అసలైన కేరళ స్టోరీ" అని వ్యాఖ్యానించారు. మతసామరస్యానికి ఈ పెళ్లి ఒక ప్రతీక అని ఎంపీ రహీమ్ పేర్కొంటూ, "పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి.. ఆ స్వర్గమే కేరళ" అని కొనియాడారు.
మోనాలిసా పెళ్లి విశేషాలు
వధువు మోనాలిసా ఎరుపు రంగు చీరలో మెరిసిపోగా, వరుడు ఫర్మాన్ ఖాన్ కేరళ సాంప్రదాయం ప్రకారం తెల్లటి షర్ట్, ముండు (ధోవతి) ధరించాడు. మోనాలిసా ప్రస్తుతం 'నాగమ్మ' అనే సినిమా ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. తనకు సినిమాల ద్వారా వచ్చే స్టార్ డమ్ కంటే ప్రియుడితో పెళ్లే ముఖ్యమని ఆమె అనడం విశేషం. 2025 మహాకుంభమేళాలో ఈమె పూలదండలు అమ్ముతున్న వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి ఆమెను సెలబ్రిటీని చేసింది.
{{/usCountry}}వధువు మోనాలిసా ఎరుపు రంగు చీరలో మెరిసిపోగా, వరుడు ఫర్మాన్ ఖాన్ కేరళ సాంప్రదాయం ప్రకారం తెల్లటి షర్ట్, ముండు (ధోవతి) ధరించాడు. మోనాలిసా ప్రస్తుతం 'నాగమ్మ' అనే సినిమా ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. తనకు సినిమాల ద్వారా వచ్చే స్టార్ డమ్ కంటే ప్రియుడితో పెళ్లే ముఖ్యమని ఆమె అనడం విశేషం. 2025 మహాకుంభమేళాలో ఈమె పూలదండలు అమ్ముతున్న వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి ఆమెను సెలబ్రిటీని చేసింది.
{{/usCountry}}