మహేష్ బాబును పిండేస్తున్న రాజమౌళి-రాముడి పాత్ర కోసం క‌ఠోర శిక్ష‌ణ‌-రెండు షాట్స్ కోసం 6 నెల‌ల ట్రైనింగ్‌

అగ్ర దర్శకుడు రాజమౌళి మూవీ మేకింగ్ స్టైలే వేరు. అనుకున్న విధంగా ఔట్ పుట్ వచ్చేంతవరకూ అతను వదలడు. ఇప్పుడు వారణాసి సినిమా కోసం మహేష్ బాబును కూడా ఇలాగే పిండేస్తున్నాడు. ఈ మూవీ కోసం 6 నెలల రన్నింగ్ ట్రైనింగ్, పురాతన యుద్ధ విద్య కళరిపయట్టు నేర్చుకున్నట్లు మహేష్ తెలిపాడు. 

Published on: Feb 4, 2026, 13:41:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాజమౌళితో షూటింగ్ హా.. టార్చర్, ఫర్పెక్ట్ ఔట్ పుట్ వచ్చేంతవరకూ వదిలిపెట్టడు, పని రాక్షసుడు.. ఇలా కంప్లయింట్స్ ఇచ్చిన హీరోలు చాలా మందే. అవును.. తాను అనుకున్నది అనుకున్నట్లు వచ్చేంతవరకూ రాజమౌళి వదలడు. ఇప్పుడు వారణాసి సినిమా కోసం కూడా మహేష్ బాబును ఆ రేంజ్ లోనే కష్టపెడుతున్నాడు. మూవీ కోసం పిండేస్తున్నాడు.

వారణాసి పోస్టర్ లో మహేష్ బాబు
వారణాసి పోస్టర్ లో మహేష్ బాబు

శ్రీరాముడి పాత్ర

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా కోసం మహేష్ బాబు తెగ కష్టపడుతున్నాడు. ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీలో శ్రీరాముడి పాత్రలోనూ మహేష్ బాబు కనిపించనున్నాడు. ఇందుకోసం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. కఠోరమైన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ శిక్షణ తీసుకున్నాడు. పురాతన యుద్ధ విద్య కళరిపయట్టును సాధన చేశాడు. రన్నింగ్ పైనా స్పెషల్ ఫోకస్ పెట్టాడు.

రాజమౌళి ప్రాసెస్

స్క్రీన్ రాంట్ ప్లస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి సినిమా కోసం ఎలా కష్టపడుతున్నాడో మహేష్ బాబు వివరించాడు. ‘‘రాజమౌళికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓ పద్ధతి ఉంటుంది. ఈ సినిమా (వారణాసి)లో నేను శ్రీరాముడి పాత్రలోనూ కనిపిస్తా. ఆ పాత్ర నడిచే విధానం, నిలబడే తీరు చాలా ముఖ్యం. అందుకే ఆ పాత్ర కోసం నా శరీరాన్ని మార్చుకున్నా’’ అని మహేష్ బాబు తెలిపాడు.

6 నెలలు

వారణాసి సినిమాలోని పాత్రకు తగ్గట్లుగా తన శరీరాన్ని మార్చుకోవడానికి మహేష్ బాబు ఏమేం చేశాడో చెప్పాడు. ‘‘కేరళ పురాతన యుద్ధ విద్య కళరిపయట్టులో మూడు నెలల శిక్షణ తీసుకున్నా. అతను (రాజమౌళి) నా రన్నింగ్ టెక్నిక్ ను కూడా మార్చాలనుకున్నాడు. ఇందు కోసం నేను ట్రాక్ అండ్ ఫీల్డ్ బృందంతో కలిసి 6 నెలల పాటు ట్రైనింగ్ పొందా. అయితే ఈ సినిమాలో ఆ షాట్లు రెండు మాత్రమే ఉంటాయి’’ అని మహేష్ బాబు వెల్లడించాడు.

కష్టమైన పని కాదు

వారణాసి సినిమా కోసం మహేష్ బాబు ఇంతలా కష్టపడుతున్నా.. నచ్చిన పని చేయడంలో కష్టం లేదని అంటున్నాడు. ‘‘ఈ సినిమా కోసం నేను కమిట్ అయి ఉన్నా. సరదాగా తీసుకుంటున్నా. షూటింగ్ ప్రాసెస్ ను ఆస్వాదిస్తున్నా. అలాంటప్పుడు పెద్ద కష్టంగా అనిపించదు’’ అని మహేష్ పేర్కొన్నాడు.

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న వారణాసి మూవీ ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More