మహేష్ బాబు అన్న కొడుకు సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్.. ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
మహేష్ బాబు అన్న దివంగత రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ ఘట్టమనేని తొలి సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్ పెట్టారు. ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
ఘట్టమనేని వంశం నుంచి మరో నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని తొలి సినిమాకు శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ గురువారం (నవంబర్ 27) రిలీజ్ చేశారు.

ఘట్టమనేని వారసుడి మూవీ
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మరో వారసుడు అడుగుపెడుతున్నాడు. అతని పేరు జయ కృష్ణ ఘట్టమనేని. మహేష్ బాబు అన్న, దివంగత నటుడు రమేష్ బాబు తనయుడు. ఆర్ఎక్స్ 100, మంగళవారంలాంటి సినిమాలతో పాపులర్ అయిన అజయ్ భూపతి డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. దీనికి శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ పెట్టినట్లు గురువారం (నవంబర్ 27) వెల్లడించారు.
చేతిలో తుపాకీ పట్టుకున్న ఓ పురుషుడి చేతిని ఓ మహిళ అడ్డుకుంటున్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ఆ తుపాకీపై మూడు నామాలు ఉండటం గమనార్హం. ఆ వెనుకే తిరుమల కొండలు, శ్రీవారి ఆలయం కనిపిస్తాయి. ఈ పోస్టర్, టైటిల్ ఆసక్తి రేపుతున్నాయి. ఆధ్యాత్మికతతో కూడిన ఓ మిస్టరీని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూపిస్తోంది.
తిరుపతి సమీపంలో కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న ప్రదేశం పేరే శ్రీనివాస మంగాపురం. దానిని మూవీ టైటిల్ గా పెట్టడం చూస్తుంటే అసలు సినిమా కంటెంట్ ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది.
శ్రీనివాస మంగాపురం మూవీ గురించి..
టాలీవుడ్‌లో ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో సంచలనం రేపిన డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ రెండూ భిన్నమైన స్టోరీ లైన్స్ తో వచ్చిన మూవీస్. అలాంటి డైరెక్టర్ నుంచి ఇప్పుడీ శ్రీనివాస మంగాపురం వస్తోంది. టైటిల్ తోపాటు ఈ సినిమా స్టోరీ లైన్ కూడా అతని గత సినిమాలతో పోలిస్తే పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా ద్వారానే జయ కృష్ణ ఘట్టమనేని ఎంట్రీ ఇస్తున్నాడు.
అశ్వనీ దత్ మూవీని సమర్పిస్తుండగా.. చందమామ కథలు బ్యానర్ లో కిరణ్ మూవీని నిర్మిస్తున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టండన్ కూతురు రాషా తడానీ ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మూవీ ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో త్వరలోనే రానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


