బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత 52 ఏళ్ల మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా స్ప్లిట్స్‌విల్లా ఎక్స్6 (Splitsvilla X6)తో గుర్తింపు పొందిన సోరబ్ బేడీతో కలిసి ఆమె సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె మళ్లీ ప్రేమలో పడిందనే వార్తలు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
సోరబ్ బేడీతో మలైకా అరోరా సెలబ్రేషన్స్

కొద్ది రోజుల క్రితం జుహు ప్రాంతంలోని మలైకా అరోరాకు చెందిన రెస్టారెంట్ లో జరిగిన ఒక వేడుకకు సోరబ్ హాజరయ్యాడు. ఆ సమయంలో మలైకాతో కలిసి డ్యాన్స్ చేస్తూ, ఆనందిస్తున్న పలు ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి.
మలైకాతో కలిసి తీసుకున్న ఫొటోలను సోరబ్ స్వయంగా తన ఖాతాలో పంచుకున్నాడు. ఆ ఫొటోలను షేర్ చేస్తూ "అభినందనలు మలైకా అరోరా" అంటూ ఒక సందేశం కూడా జత చేశాడు. అయితే ఆశ్చర్యకరంగా, కొద్దిసేపటికే అతను ఆ పోస్ట్‌ను తొలగించడం గమనార్హం.
చాలా క్లోజ్‌గా జంట
ఒక ఫొటోలో సోరబ్‌తో కలిసి మలైకా చాలా దగ్గరగా నిలబడగా, మరో చిన్న వీడియోలో అతనితో కలిసి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియోలు చూసిన వాళ్లు.. వీరిద్దరి మధ్య కేవలం స్నేహానికి మించిన బంధం ఉందంటూ రకరకాల కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
వీరిద్దరూ చూడటానికి చాలా బాగున్నారని కొందరు అంటుంటే.. "ఆమె కూడా మనిషే కదా, ఆమె జీవితంలో కూడా ప్రేమ ఉండాలి" అని మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంకొందరైతే "ఇదేం పనండీ బాబూ", "వావ్, ఎంత అందమైన జంట" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మలైకా అరోరా గతం, వదంతులు
మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. గతంలో ఆమె బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన వీరి బంధం.. 2017లో విడాకులతో అధికారికంగా ముగిసింది. వీరికి అర్హాన్ అనే కొడుకు ఉన్నాడు. ఆ తర్వాత 2018లో నటుడు అర్జున్ కపూర్‌తో ఆమె ప్రేమాయణం మొదలుపెట్టింది. చాలా ఏళ్లుగా గాఢమైన ప్రేమలో ఉన్న వీరు, ఇటీవల విడిపోయినట్లు స్పష్టమైంది.
{{/usCountry}}మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. గతంలో ఆమె బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన వీరి బంధం.. 2017లో విడాకులతో అధికారికంగా ముగిసింది. వీరికి అర్హాన్ అనే కొడుకు ఉన్నాడు. ఆ తర్వాత 2018లో నటుడు అర్జున్ కపూర్‌తో ఆమె ప్రేమాయణం మొదలుపెట్టింది. చాలా ఏళ్లుగా గాఢమైన ప్రేమలో ఉన్న వీరు, ఇటీవల విడిపోయినట్లు స్పష్టమైంది.
{{/usCountry}}అర్జున్‌తో విడిపోయిన తర్వాత ఓ గుర్తుతెలియని వ్యక్తితో మలైకా కనిపించడంతో ఆమె ప్రేమ జీవితంపై మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. దీనిపై యూట్యూబ్‌లో ప్రసారమైన 'ద నమ్రత జకారియా' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె స్పష్టంగా స్పందించింది.
"వ్యక్తులకు ఎప్పుడూ ఇతరుల గురించి మాట్లాడుకోవడం ఇష్టం. మనం ఎవరితోనైనా బయటకు వెళ్తే చాలు, అది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఇలాంటి పుకార్లకు నేను అనవసరంగా ప్రాధాన్యత ఇవ్వదలచుకోలేదు. ఎందుకంటే దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నన్ను నమ్మండి, నేను ఏ పాత స్నేహితుడితోనో, పెళ్లైన స్నేహితుడితోనో, నా నిర్వాహకుడితోనో బయటకు వెళ్లినా వెంటనే నన్ను వాళ్లతో ముడిపెట్టి వార్తలు రాస్తున్నారు. మేమైతే ఈ వార్తలు చూసి నవ్వుకుంటున్నాము. మా అమ్మ మొబైల్లో అడిగి 'ఇప్పుడు ఇతను ఎవరు? వాళ్లు ఎవరి గురించి మాట్లాడుతున్నారు?' అని అడుగుతుంది. ఇదంతా చూస్తుంటే నాకు చాలా నవ్వొస్తోంది" అంటూ మలైకా ఈ పుకార్లను కొట్టిపారేసింది.