...
...
Next Story

ఈమెకు 52 ఏళ్లా.. వయసు పెరుగుతోందా.. తగ్గుతోందా? మంట పుట్టిస్తున్న మలైకా అరోరా లేటెస్ట్ ఫొటోలు

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తన కొత్త హెయిర్ స్టైల్‌తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. 52 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తోందంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె లేటెస్ట్ ఫొటోలు, కొత్త లుక్‌పై ఫ్యాన్స్ రియాక్షన్స్ ఇక్కడ చూడండి.

Published on: Feb 05, 2026 09:08 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

వయసు పెరుగుతున్నా తరగని అందం మలైకా అరోరా సొంతం. ఐటెం సాంగ్స్ క్వీన్ అయిన ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎప్పుడూ తన ఫిట్‌నెస్, ఫ్యాషన్‌తో వార్తల్లో నిలిచే ఈ భామ.. తాజాగా తన కొత్త హెయిర్ స్టైల్‌తో దర్శనమిచ్చింది. గురువారం (ఫిబ్రవరి 5) ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

"కొత్త ఏడాది.. కొత్త జుట్టు"

ఈమెకు 52 ఏళ్లా.. వయసు పెరుగుతోందా.. తగ్గుతోందా? మంట పుట్టిస్తున్న మలైకా అరోరా లేటెస్ట్ ఫొటోలు
ఈమెకు 52 ఏళ్లా.. వయసు పెరుగుతోందా.. తగ్గుతోందా? మంట పుట్టిస్తున్న మలైకా అరోరా లేటెస్ట్ ఫొటోలు

ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ యశ్వంత్ తాజాగా మలైకా అరోరాకు ఓ కొత్త హెయిర్ స్టైల్ సెట్ చేశాడు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. "చాప్ చాప్.. నయా సాల్, నయా బాల్ (కొత్త సంవత్సరం, కొత్త జుట్టు)" అంటూ క్యాప్షన్ పెట్టింది.

ఈ లేటెస్ట్ ఫొటోల్లో మలైకా నలుపు రంగు డీప్ నెక్ బాడీసూట్, హై-వెస్ట్ లెదర్ ప్యాంట్‌ ధరించి స్టైలిష్‌గా పోజులిచ్చింది. ముఖ్యంగా ఆమె కొత్తగా చేయించుకున్న 'కర్టెన్ బ్యాంగ్స్' (Curtain Bangs - నుదుటిపైకి జుట్టు కత్తిరించుకోవడం) ఆమె ముఖానికి మరింత వన్నె తెచ్చాయి. బ్రూనెట్ రంగులో ఉన్న ఆమె కురులు చూపర్లను కట్టిపడేస్తున్నాయి.

"అసలు ఈమెకు వయసవుతోందా?"

మలైకా కొత్త లుక్ చూసి ఆమె సోదరి అమృత అరోరా "లవ్స్ ఇట్" అని కామెంట్ చేయగా, నటి రియా చక్రవర్తి హార్ట్, ఫైర్ ఎమోజీలతో స్పందించింది. ఇక నెటిజన్లు అయితే ఆమె అందాన్ని చూసి నోరెళ్లబెడుతున్నారు. చాలామంది ఆమె వయసును, అందాన్ని పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు.

"రోజురోజుకూ మీరు చిన్నపిల్లలా మారుతున్నారు".. "ఈమెకు అసలు వయసు పెరగదా? నిజంగా దేవతలా ఉంది".. "చూడటానికి అచ్చం 20 ఏళ్ల అమ్మాయిలా ఉంది".. "50 ఏళ్ల వయసులో ఇలా మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు.. గోల్స్".. "నేను ఆమె వయసుకి వచ్చేసరికి బామ్మలా అయిపోతానేమో" అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం విశేషం.

ఫిట్‌నెస్ ఫ్రీక్.. ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్

వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌తో 19 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోయింది. వీరికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత అర్జున్ కపూర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన మలైకా.. కొన్నేళ్ల క్రితం అతనితోనూ విడిపోయింది.

కెరీర్ పరంగా 'చయ్య చయ్య', 'మున్నీ బద్నామ్', 'అనార్కలి డిస్కో చలి', 'పాండే జీ సీటీ' వంటి ఎన్నో సూపర్ హిట్ ఐటెం సాంగ్స్‌తో అలరించిన మలైకా.. ప్రస్తుతం 'ఝలక్ దిఖ్లా జా', 'ఇండియాస్ గాట్ టాలెంట్' వంటి పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe