...
...
Next Story

OTT Trending: ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్.. ట్రెండింగ్ నంబర్ వన్.. తెగ చూసేస్తున్న తెలుగు జనాలు

OTT Trending: ఓటీటీలో మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ అదరగొడుతోంది. డిజిటల్ ఆడియన్స్ కు థ్రిల్ అందిస్తూ స్ట్రీమింగ్ లో దూసుకుపోతోంది. ఆ మూవీ వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: Apr 23, 2026, 13:47:51 IST
Advertisement

OTT Trending: వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో, క్షణక్షణం ఉత్కంఠ రేపే కథనంతో ఓటీటీ ఆడియన్స్ ను మలయాళం మిస్టరీ థ్రిల్లర్ ‘సంభవం అధ్యాయం ఒన్ను’ అలరిస్తోంది. ఈ సినిమా ఓటీటీ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఏకంగా మూడు భాషల్లో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.

సంభవం అధ్యాయం ఒన్ను ఓటీటీ

ఓటీటీ ట్రెండింగ్ లో మలయాళం థ్రిల్లర్ (x)
ఓటీటీ ట్రెండింగ్ లో మలయాళం థ్రిల్లర్ (x)

రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘సంభవం అధ్యాయం ఒన్ను’ ఓటీటీని షేక్ చేస్తోంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 15న ఓటీటీలో అడుగుపెట్టింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

మూడు భాషల్లో

జియోహాట్‌స్టార్ లో ప్రస్తుతం ‘సంభవం అధ్యాయం ఒన్ను’ మూవీ మూడు భాషల్లో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. మలయాళంతో పాటు కన్నడ, తెలుగులో నంబర్ వన్ మూవీగా ఈ థ్రిల్లర్ దూసుకెళ్తోంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ మలయాళ థ్రిల్లర్ ను తెగ చూసేస్తున్నారు. ఇందులోని ట్విస్ట్ లను ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ సంభవం అధ్యాయం ఒన్ను చిత్రంలో అస్కర్ అలీ, వినీత్ కుమార్, అస్సిమ్ జమాల్ తదితరులు నటించారు. ఇందులో టైమ్ లూప్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీనికి జీతూ సతీషన్ డైరెక్టర్. ఇప్పటివరకూ మీరు ఈ సినిమా చూడకపోయి ఉంటే వెంటనే ఓ లుక్కేయండి. కచ్చితంగా థ్రిల్ అవుతారని చెప్పొచ్చు.

కథ ఏమిటంటే?

కేరళ, తమిళనాడు సరిహద్దులోని అడవిలో మిస్సింగ్ కేసులు నమోదవుతుంటాయి. కనిపించకుండా పోయిన తమ సహచరుడి కోసం అక్కడికి వెళ్లిన పోలీసులకు వింత అనుభవం ఎదురవుతుంది. ఓ టైమ్ లూప్ లో చిక్కుకొని, తమను తామే వేర్వేరు వెర్షన్లలో చూసుకొని షాకవుతారు.

సంభవం అధ్యాయం ఒన్ను ఒక ఆసక్తికరమైన టైమ్ లూప్ థ్రిల్లర్. ఒకే సంఘటన చుట్టూ తిరిగే కాలచక్రాన్ని, అందులోని మిస్టరీని ఛేదించే క్రమంలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మరి అడవిలోకి వెళ్లిన పోలీసులకు ఏం జరిగింది? ఎందుకు లూప్ లో చిక్కుకుపోతారన్నదే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe