OTT Malayalam:ఆరు రోజులకే ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ మూవీ..మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్..అండర్‌గ్రౌండ్‌లో రెజ్లింగ్
ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. కానీ ఈ మలయాళ సినిమా థియేటర్లలో రిలీజైన ఆరు రోజులకే ఓటీటీలోకి రాబోతుండం గమనార్హం. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ కాబోతున్న ఈ మూవీ వివరాలు ఇక్కడ చూసేయండి.
ఓటీటీల డిమాండ్ పెరిగిపోయాక తెలుగు ఆడియన్స్ కూడా తమిళ్, మలయాళం, కన్నడ లాంటి ఇతర భాషల సినిమాలను తెగ చూసేస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ను అసలు మిస్ కావడం లేదు. ఇప్పుడు అలాంటి ఓ మలయాళం మూవీ తెలుగులో థియేటర్లలో రిలీజైన ఆరు రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. చథా పచ్చ సినిమా మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది.

చథా పచ్చ ఓటీటీ
రీసెంట్ గా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా చథా పచ్చ. ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఇది ఓటీటీ రిలీజ్ కానుంది.
ఆరు రోజుల్లోనే
సాధారణంగా సినిమాలు నాలుగు వారాల థియేట్రికల్ విండో తర్వాత ఓటీటీలోకి వస్తాయి. కొన్ని ఏమో రెండు వారాలకు వస్తాయి. కానీ ఈ మలయాళ మూవీ చథా పచ్చ మాత్రం ఆరు రోజులకే ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 13న రిలీజైంది. ఈ రోజు మిడ్ నైట్ నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
మలయాళంలో సూపర్ హిట్
చథా పచ్చ మూవీ మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన చథా పచ్చ బాక్సాఫీస్ దగ్గర రూ.30 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టింది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాను థియేటర్లలో ఎవరూ పట్టించుకోలేదు. ఆక్యుపెన్సీ లేకపోవడంతో షోలు కూడా రద్దు చేశారు. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విషాక్ నాయర్ లీడ్ రోల్స్ ప్లే చేశారు.
చథా పచ్చ ఓటీటీ
కేరళలోని ఓ గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. ఈ ముగ్గురికి వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) అంటే పిచ్చి. ఇందులో రెజ్లర్లు తీవ్రంగా కొట్టుకుంటుంటే ఈ బ్రదర్స్ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ డబ్ల్యూడబ్ల్యూఈపై పిచ్చితోనే గ్రామంలో అలాంటి ఏర్పాటు చేస్తారు.
గ్రామంలో ఒక అండర్ గ్రౌండ్ రెజ్లింగ్ క్లబ్ ప్రారంభిస్తారు. అక్కడ రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తారు. కుస్తీ విన్యాసాలు చేశారు. మరి చివరకు ఏమైంది? ఈ రెజ్లింగ్ క్లబ్ వల్ల వీళ్లకు ఎలాంటి పరిస్థితి తలెత్తింది? అన్నది చథా పచ్చ మూవీలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


