మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. మూడు నెలల తర్వాత ఓటీటీలోకి.. ఓ రేపిస్ట్, జర్నలిస్ట్ జంట చుట్టూ తిరిగే కథతో..

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అమోజ్ అలెగ్జాండర్ మూడు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. గతేడాది నవంబర్ లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఓ రేపిస్ట్, ఓ జర్నలిస్ట్, కెమెరామ్యాన్ జంట చుట్టూ తిరుగుతుంది.

Published on: Feb 17, 2026, 19:20:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళం థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్లలో ఏ సినిమా వచ్చినా ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. అలా ఇప్పుడు అమోజ్ అలెగ్జాండర్ అనే మరో ఇంట్రెస్టింగ్ మూవీ వస్తోంది. ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో ఈవారమే స్ట్రీమింగ్ కానుంది. గతేడాది నవంబర్ 14న థియేటర్లలో రిలీజై మిక్స్‌డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. మూడు నెలల తర్వాత ఓటీటీలోకి.. ఓ రేపిస్ట్, జర్నలిస్ట్ జంట చుట్టూ తిరిగే కథతో..
మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. మూడు నెలల తర్వాత ఓటీటీలోకి.. ఓ రేపిస్ట్, జర్నలిస్ట్ జంట చుట్టూ తిరిగే కథతో..

అమోజ్ అలెగ్జాండర్ ఓటీటీ రిలీజ్

ప్రముఖ మలయాళ నటుడు అజు వర్గీస్, తారా అమల జోసెఫ్, జాఫర్ ఇడుక్కిలాంటి వాళ్లు నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ అమోజ్ అలెగ్జాండర్ (Amoz Alexander). ఈ సినిమా ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలోకి రాబోతోంది.

“కొన్ని మిస్టరీలను ఛేదించలేరు.. వాటికవే బయటపడతాయి. అమోజ్ అలెగ్జాండర్ ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో సన్ నెక్ట్స్ ఓటీటీ ట్వీట్ చేసింది.

అమోజ్ అలెగ్జాండర్ మూవీ విశేషాలు

జాఫర్ ఇడుక్కి, అజు వర్గీస్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘అమోజ్ అలెగ్జాండర్’. ఒక జర్నలిస్ట్, కరుడుగట్టిన నేరస్తుడి మధ్య జరిగే సైకలాజికల్ ఫైట్ గా తెరకెక్కింది. అజయ్ షాజీ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది నవంబర్ 14న విడుదలైంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మేరీ ఫిలిప్ (తారా అమలా జోసెఫ్) ఒక క్రైమ్ జర్నలిస్ట్. ఆమె తన కెమెరామెన్ జాన్ (అజు వర్గీస్)తో కలిసి అమోజ్ అలెగ్జాండర్ (జాఫర్ ఇడుక్కి) అనే ఒక కరుడుగట్టిన నేరస్తుడిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుంది. అయితే ఆ ఇంటర్వ్యూ సాధారణంగా సాగదు.

తాను చేసినవి మాత్రమే కాకుండా.. బయట ప్రపంచానికి తెలియని మరిన్ని భయంకరమైన నేరాలను కూడా ఒప్పుకుంటానని అమోజ్ చెప్పడంతో కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. ఆ ఇంటర్వ్యూ కాస్తా వారి ముగ్గురి మధ్య ఒక ప్రమాదకరమైన, డార్క్ సైకలాజికల్ వార్‌గా మారుతుంది.

ఈ మూవీలో టైటిల్ రోల్‌లో జాఫర్ ఇడుక్కి తనదైన నటనతో భయపెట్టాడు. అజు వర్గీస్ సీరియస్ రోల్‌లో ఆకట్టుకున్నాడు. మినీబాయ్ సంగీతం, ప్రమోద్ కె పిళ్లై సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేశాయి.

విమర్శకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఇది ఒక స్లో బర్నింగ్ థ్రిల్లర్ అని, జాఫర్ ఇడుక్కి నటన, విజువల్స్ బాగున్నాయని ప్రశంసించారు. అయితే స్క్రీన్ ప్లేలో అక్కడక్కడా లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More