Malayalam Actress: నన్ను మీ హిందీ సినిమాల్లోకి తీసుకోకండి- బాలీవుడ్ దర్శకులకు మలయాళ అవార్డ్ నటి కని కుస్రుతి- ఎందుకంటే?
Kani Kusruti Request To Bollywood Directors: దక్షిణాది నటీనటులు బాలీవుడ్ వైపు క్యూ కడుతుంటే మలయాళ విలక్షణ నటి కని కుస్రుతి మాత్రం తనను హిందీ చిత్రాల్లో నటించేందుకు తీసుకోవద్దని కోరుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకు గల కారణాలను కూడా కని కుస్రుతి వివరించారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా ఎల్లలు చెరిగిపోయాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నటీనటులు కీలక పాత్రలు పోషించడం సర్వసాధారణం అయిపోయాయి. ఇలాంటి సమయంలో ఒక ప్రతిభావంతురాలైన నటి "నన్ను మీ సినిమాల్లో తీసుకోకండి" అని బాలీవుడ్ దర్శకులను కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె మరెవరో కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మలయాళ పాపులర్ నటి కని కుస్రుతి.

హిందీ రాకపోవడమే శాపం..
పాయల్ కపాడియా దర్శకత్వంలో వచ్చిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన కని కుస్రుతి లేటెస్ట్‌గా అనుభవ్ సిన్హా తెరకెక్కించిన ‘అస్సీ’ (Assi) చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను "మీకు హిందీలో ఎక్కువ అవకాశాలు ఎందుకు రావడం లేదు?" అని ప్రశ్నించగా కని కుస్రుతి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
"నిజం చెప్పాలంటే నాకు హిందీ రాదు. అందుకే నన్ను మీ సినిమాల్లో తీసుకోకండి అని నేనే దర్శకులను కోరుతున్నాను. నాకు వచ్చే ప్రతి పాత్రను నేను చేయలేను. ‘అస్సి’ సినిమాలో నా పాత్ర కేరళకు చెందినదిగా ఉంటుంది" అని కని కుస్రుతి తెలిపారు.
"దర్శకుడు అనుభవ్ సిన్హా ఎంతో దయతో ఆ మార్పు చేశారు. మొదట ఆయన నా పాత్ర ఉత్తర భారతం లేదా ఢిల్లీకి చెందిన మహిళగా ఉండాలని అనుకున్నారు. కానీ, నాకు హిందీ రాదని తెలిసి, పాత్ర నేపథ్యాన్ని మార్చారు" అని కని కుస్రుతి వివరించారు.
“నేను పక్కా మలయాళీని”
హిందీ నేర్చుకోవడం తన వల్ల కాదని కని కుస్రుతి కుండబద్దలు కొట్టారు. "నేను కనీసం డైలాగులు కూడా గుర్తుపెట్టుకోలేను. వాటిని అర్థం చేసుకోవడానికే నాకు చాలా సమయం పడుతుంది. అంత వేగంగా నేను భాషను నేర్చుకోలేను. అంతేకాదు.. సంస్కృతి పరంగా కూడా నేను పక్కా మలయాళీని. నా ఆలోచనలు ఎప్పుడూ మలయాళంలోనే ఉంటాయి. ఆఖరికి ఇంగ్లీష్ మాట్లాడాలన్నా కూడా నేను మనసులో అనువాదం చేసుకోవాల్సిందే" అని కని కుస్రుతి తన ఇబ్బందిని బయటపెట్టారు.
విమర్శకుల ప్రశంసలు.. కానీ బాక్సాఫీస్ వద్ద అలా..
ఇదిలా ఉంటే ‘అస్సి’ చిత్రంలో రేప్ సర్వైవర్ 'పరిమ' పాత్రలో కని కుస్రుతి అద్భుతమైన నటన కనబరిచారు. ఢిల్లీ కోర్టులో న్యాయం కోసం పోరాడే బాధితురాలిగా ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
లాయర్‌గా తాప్సీ పన్ను
హీరోయిన్ తాప్సీ పన్ను లాయర్‌గా నటించిన అస్సి చిత్రంలో రేవతి, మనోజ్ పహ్వా వంటి దిగ్గజాలు నటించారు. సినిమాపై ప్రశంసలు, నటీనటుల అద్భుతమైన నటన ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కేవలం రూ. 5 కోట్లు మాత్రమే వసూలు చేసి నెమ్మదిగా సాగుతోంది అస్సి సినిమా.
కని కుస్రుతి నేపథ్యం
కేరళలోని త్రిస్సూర్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పొందిన కని కుస్రుతి పారిస్‌లో కూడా థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేశారు. 2009లో ‘కేరళ కేఫ్’తో కెరీర్ ప్రారంభించిన ఆమె.. మోహన్ లాల్ నటించిన ‘శిక్కర్’, అలాగే ‘కాక్‌టెయిల్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. ‘బిర్యానీ’ చిత్రానికి గానూ కేరళ స్టేట్ ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకున్నారు కని కుస్రుతి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


