OTT Malayalam: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే వినూత్నమైన కథలు, మనసును హత్తుకునే హాస్యం, కుటుంబ సంబంధాల చుట్టూ తిరిగే డ్రామాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ విపరీతమైన ఆదరణ ఉంటుంది. అదే కోవలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన లేటెస్ట్ మలయాళం ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ 'అవరాచన్ అండ్ సన్స్' (Avaraachan & Sons).

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. అక్టోబర్ 30 నుంచి ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు తీసుకువస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ , హిందీ డబ్బింగ్ వెర్షన్లలో ఈ చిత్రం ఏకకాలంలో అందుబాటులోకి రానుంది.
5 భాషల్లో స్ట్రీమింగ్: తెలుగు ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్
సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న ఓటీటీ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను మొత్తంగా ఐదు భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. దీనితో తెలుగు ప్రేక్షకులు నేరుగా తమ సొంత భాషలోనే ఈ ఫీల్-గుడ్ కామెడీని ఆస్వాదించవచ్చు.
దర్శకుడు అమల్ షీలా తంబి (Amal Sheela Thamby) తెరకెక్కించిన ఈ అవరాచన్ అండ్ సన్స్ చిత్రంలో సీనియర్ విలక్షణ నటుడు బిజూ మీనన్ (Biju Menon) లీడ్ రోల్ అయిన 'అవరాచన్' (తండ్రి) గా నటించగా.. శ్రీనాథ్ భాసి (Sreenath Bhasi), గణపతి (Ganapathy) ఆయన కొడుకులు జైసన్, జైమోన్లుగా అలరించారు. అఖిల భార్గవన్, గ్రేస్ ఆంటోనీ, వినయ్ ఫోర్ట్ ఇతర కీలక పాత్రల్లో మెరిసారు.
అవరాచన్ అండ్ సన్స్ స్టోరీ ఏంటంటే?
'అవరాచన్ అండ్ సన్స్' కథ అంతా ఒక బాధ్యత లేని తండ్రి, అతని ప్రవర్తన వల్ల తీవ్ర ఇబ్బందులు పడే ఇద్దరు కొడుకుల చుట్టూ తిరుగుతుంది. ఒక ఆఫీస్ స్కాం వల్ల తండ్రి అవరాచన్ (బిజూ మీనన్) తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. ఆ తర్వాత కూడా ఎలాంటి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ, తన అల్లరి చేష్టలతో కొడుకులను ఇరకాటంలో పెడతాడు.
{{/usCountry}}'అవరాచన్ అండ్ సన్స్' కథ అంతా ఒక బాధ్యత లేని తండ్రి, అతని ప్రవర్తన వల్ల తీవ్ర ఇబ్బందులు పడే ఇద్దరు కొడుకుల చుట్టూ తిరుగుతుంది. ఒక ఆఫీస్ స్కాం వల్ల తండ్రి అవరాచన్ (బిజూ మీనన్) తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. ఆ తర్వాత కూడా ఎలాంటి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ, తన అల్లరి చేష్టలతో కొడుకులను ఇరకాటంలో పెడతాడు.
{{/usCountry}}చివరకు కొడుకు పెళ్లి సంబంధం చెడిపోవడానికి కూడా తండ్రే కారణమవుతాడు. ఈ క్రమంలో స్థానికులతో గొడవపడి దాడి నుంచి తప్పించుకోవడానికి అవరాచన్ తన అక్క ఎల్లికుట్టి ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆయన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? తండ్రీకొడుకుల మధ్య దూరం ఎలా తగ్గింది? అనేది నవ్వులు పూయించే సంఘటనలతో తెరకెక్కించారు.
అవరాచన్ అండ్ సన్స్ ఎలా ఉందంటే?
ఈ సినిమాలో బిజూ మీనన్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో మరోసారి జీవించారు. తండ్రి ప్రవర్తనతో విసిగిపోయిన పెద్ద కొడుకుగా శ్రీనాథ్ భాసి, అమాయకపు చిన్న కొడుకుగా గణపతి పోటీపడి నటించారు. కుటుంబంలో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించే కోడలి పాత్రలో అఖిల భార్గవన్ నటన ఆకట్టుకుంటుంది.
జోసెఫ్ విజేష్‌తో కలిసి దర్శకుడు అమల్ షీలా తంబి రాసుకున్న డైలాగులు, మానవ సంబంధాల విశ్లేషణ సహజంగా ఉంటాయి. సజిత్ పురుషన్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీకెండ్ లో కుటుంబ సమేతంగా హాయిగా నవ్వుకోవడానికి 'అవరాచన్ అండ్ సన్స్' ఒక పర్ఫెక్ట్ వీకెండ్ చాయిస్. శుక్రవారం (అక్టోబర్ 30) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.