ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ట్యాక్సీ డ్రైవర్‌తో ఆడుకునే లేడీ కిల్లర్.. ఇక్కడ చూసేయండి
ఓటీటీలోకి సుమారు రెండేళ్ల తర్వాత ఓ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఓ లేడీ కిల్లర్, ట్యాక్సీ డ్రైవర్ చుట్టూ తిరిగే కథ ఇది. ఐఎండీబీలో 7.8 రేటింగ్ ఉండటం విశేషం.
ఈవారం ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. దీనిపేరు అంధకార. గతేడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మొత్తానికి 22 నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. దివ్య పిళ్లై ఓ సీరియల్ కిల్లర్ గా నటించిన మూవీ ఇది. ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.

అంధకార ఓటీటీ రిలీజ్ డేట్
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అంధకార. ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 12) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “ఒక రైడ్. ఒక పీడకల. అంధకారం రేపటి నుంచి చుట్టముట్టబోతోంది. అంధకార సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన చిన్న టీజర్ ను షేర్ చేసింది. మీరు పరుగెత్తొచ్చు.. కానీ మీరు దాక్కోలేరు అంటూ ఆ వీడియో చాలా ఇంటెన్స్ విజువల్స్ తో సాగింది.
అంధకార మూవీ గురించి..
అంధకార ఓ మలయాళ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా గతేడాది ఫిబ్రవరి 16న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను వాసుదేవ్ సనల్ డైరెక్ట్ చేశాడు. ఇందులో దివ్య పిళ్లైతోపాటు చందునాథ్, ధీరజ్ డెన్నీ, ఆంథోనీ హెన్రీ, సుధీర్ కరమణలాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.8 రేటింగ్ ఉంది. ఇది ఓ లేడీ కిల్లర్ చుట్టూ తిరిగే కథ. ఆమె ఓ రోజు ఓ ట్యాక్సీలో ప్రయాణిస్తుంది.
ఆ డ్రైవర్ వికలాంగుడు. అయితే అతడు ఈ కిల్లర్ తోపాటు ఆమెను వెంటాడే ఓ గ్రూపు మధ్యలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ లేడీ కిల్లర్ ఎవరు? ఆమెను వెంటాడేది ఎవరు అన్నది తెలియాలంటే ఈ అంధకార సినిమా చూడాల్సిందే. సుమారు రెండేళ్ల తర్వాత ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 12) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


