ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన 5 సినిమాలు- కచ్చితంగా చూడాల్సినవి 4- ఒక్కోటి ఒక్కో రకం- ఇంట్రెస్టింగ్ జోనర్లలో!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు తెలుగు భాషలో ఐదు సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో కచ్చితంగా చూసేలా నాలుగు సినిమాలు ఉంటే అవి ఒక్కోటి ఒక్కో రకమైన జోనర్‌తో ఉన్నాయి. హారర్, ఫ్యామిలీ, కామెడీ, సూపర్ హీరో వంటి ఇంట్రెస్టింగ్ జోనర్లలో నేడు ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు తెలుగు భాషలో 5 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో రెండు మాత్రమే తెలుగు స్ట్రయిట్ సినిమాలు ఉంటే మిగతావి డబ్బింగ్ వెర్షన్‌లో వచ్చినవే. అలాగే, వీటిలో కచ్చితంగా చూడాల్సిన సినిమాలుగా నాలుగు ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో రకంగా ఇంట్రెస్టింగ్ జోనర్లలో ఉన్న ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

సూపర్‌మ్యాన్ ఓటీటీ
ఈ టైటిల్‌తో హాలీవుడ్‌లో అనేక సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలోనే 2025లో జూలైలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ సూపర్‌మ్యాన్ సినిమా. ఐఎమ్‌డీబీ నుంచి 7.1 రేటింగ్ అందుకుంది. కాబట్టి ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా.
అలాగే, సూపర్‌మ్యాన్ అదిరిపోయే బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టింది. జియో హాట్‌స్టార్‌లో నేటి (డిసెంబర్ 11) నుంచి సూపర్‌మ్యాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సూపర్‌మ్యాన్ ఓటీటీ రిలీజ్ అయింది.
మ్యాన్ వర్సెస్ బేబీ ఓటీటీ
హాలీవుడ్ దిగ్గజ నటుడు, మిస్టర్ బీన్ ఫేమ్ రోవన్ అట్కిన్‌సన్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ వెబ్ సిరీస్ మ్యాన్ వర్సెస్ బేబీ. బ్రిటిష్ కామెడీ టెలివిజన్ సిరీస్‌గా వచ్చిన మ్యాన్ వర్సెస్ బేబీ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 11 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళంలో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ అయింది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇవాళ రెండు సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అందులో ఒకటి అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల నటించిన హారర్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ 12ఏ రైల్వే కాలనీ. జంట హత్యల నేపథ్యంలో సాగుతూ కచ్చితంగా చూడాల్సినటువంటి ఈ సినిమా ప్రైమ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ఓటీటీ రిలీజ్ అయింది.
బ్రాట్ ఓటీటీ
అమెజాన్ ప్రైమ్‌లో నేడు ఓటీటీ రిలీజ్ అయిన మరో సినిమా బ్రాట్. కన్నడలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన బ్రాట్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో అడుగుపెట్టింది. నిజాయితీ గల కానిస్టేబుల్ కొడుకు తన డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు బెట్టింగ్ మాఫియాలోకి దిగడమే ఈ సినిమా కథ. ఐఎమ్‌డీబీలో 7.7 రేటింగ్ సాధించిన బ్రాట్ కచ్చితంగా చూడాల్సిన సినిమాల్లో ఒకటిగా ఉంది.
కలివి వనం ఓటీటీ
తెలుగులో రూరల్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన సినిమా కలివి వనం. పర్యావరణంపై ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కిన సినిమా ఇది. యూట్యూబ్‌లో ఫోక్ సాంగ్స్‌తో తెగ పాపుల్ అయిన నాగదుర్గ హీరోయిన్‌గా నటించిన తొలి తెలుగు సినిమా కలివి వనం ఓటీటీలోకి నేడు వచ్చేసింది.
ఈటీవీ విన్‌లో ఇవాళ్టీ నుంచి కలివి వనం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో నాగదుర్గతోపాటు సమ్మేట గాంధీ, రఘుబాబు, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ ఇతర కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ రాజ్ నరేంద్ర దర్శకత్వం వహించారు. పర్యావరణంపై అవగాహన పెంచేలా, అడవులను సంరక్షించడం వంటి కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిన మూవీగా ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


