20 ఏళ్ల క్రితం ఫ్యామిలీ బిజినెస్ వదిలి వచ్చాను- సినిమాలు రావడం లేదు, చేసినవి హిట్ కావట్లేదు:బిగ్ బాస్ అలీ రెజా కామెంట్స్

బిగ్ బాస్ తెలుగు 3 సీజన్‌లో ఆటతో అలరించిన కంటెస్టెంట్ అలీ రెజా. సీరియల్స్‌తో పాపులర్ అయిన అలీ రెజా పలు తెలుగు సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. తాజాగా అలీ రెజా యాక్ట్ చేసిన ఓటీటీ సిరీస్ నయనం. వరణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన నయనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అలీ రెజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Dec 11, 2025, 11:23:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో సీరియల్స్‌తో పాపులర్ అయిన నటుడు అలీ రెజా. పసుపు కుంకుమ, మాటే మంత్రము వంటి సీరియల్స్‌లో అట్రాక్ట్ చేసిన అలీ రెజా బిగ్ బాస్ తెలుగు 3 సీజన్‌లో తనదైన ఆటతో అలరించాడు. అలా బిగ్ బాస్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న అలీ రెజా టాలీవుడ్ సినిమాలు చేస్తూ కొంతకాలం బిజీ అయ్యాడు.

20 ఏళ్ల క్రితం ఫ్యామిలీ బిజినెస్ వదిలి వచ్చాను- సినిమాలు రావడం లేదు, చేసినవి హిట్ కావట్లేదు:బిగ్ బాస్ అలీ రెజా కామెంట్స్
20 ఏళ్ల క్రితం ఫ్యామిలీ బిజినెస్ వదిలి వచ్చాను- సినిమాలు రావడం లేదు, చేసినవి హిట్ కావట్లేదు:బిగ్ బాస్ అలీ రెజా కామెంట్స్

ఓటీటీ సిరీస్‌తో

ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత ఓటీటీ సిరీస్‌తో అలరించేందుకు రెడీ అయ్యాడు అలీ రెజా. హీరో వరుణ్ సందేశ్, బిగ్ బాస్ ప్రియాంక జైన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఓటీటీ సిరీస్ నయనం. సైకో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన నయనం సిరీస్‌కు స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు.

అలీ రెజా కామెంట్స్

నయనం సిరీస్‌లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలీ రెజా కనిపించాడు. ఇటీవల నయనం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నయనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సినిమాలు ఆడ‌టం లేదు

యాక్ట‌ర్ అలీ రెజా మాట్లాడుతూ.. "నా లైఫ్‌లో సినిమాలు ఓ ఫేజ్ వ‌చ్చింది. సినిమాలు రావ‌టం లేదు. వ‌చ్చిన సినిమాలు కంప్లీట్ కావ‌టం లేదు.. కంప్లీట్ అయిన సినిమాలు ఆడ‌టం లేదు. ఆ ఫేజ్‌లో ఏం చేయాల‌ని ఆలోచిస్తున్న‌ప్పుడు మా ఫ్యామిలీ బిజినెస్ చేసుకుంటున్నాను" అని అన్నాడు.

ఏదో మిస్ అయ్యింద‌నిపిస్తోంది

"ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. డ‌బ్బులు వ‌స్తున్నాయి, అంతా బాగానే న‌డుస్తుంది. కానీ, ఏదో మిస్ అయ్యింద‌నిపిస్తోంది. 20 ఏళ్ల క్రితం బిజినెస్ వ‌దిలి ప్యాష‌న్‌తో ఇక్క‌డ‌కు వ‌చ్చాను. ఏదో మిస్ చేస్తున్నామ‌ని బాధ‌ప‌డుతుంటే, ఒక నెల‌లో రెండు ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. రెండు ఓకే చేశాను. అందులో ఒక‌టి హిందీలో సీరియ‌ల్‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించాను" అని అలీ రెజా తెలిపాడు.

డిఫ‌రెంట్‌గా వ‌రుణ్ సందేశ్‌

"డైరెక్టర్ స్వాతి గారు ఫుల్ స‌పోర్ట్ ఇచ్చారు. అనూరాధ‌గారు నా జ‌ర్నీలో ఎప్పుడూ భాగ‌మే. ఎప్పుడూ స‌పోర్ట్ చేస్తుంటారు. ఏదైనా రోల్ అడిగిన వెంట‌నే అవకాశం ఇస్తుంటారు. ఇప్పుడు ఈ సిరీస్‌లోనూ ఛాన్స్ ఇచ్చారు. నేను నా బెస్ట్ ఇచ్చాన‌ని అనుకుంటున్నాను. వ‌రుణ్ సందేశ్‌ను డిఫ‌రెంట్‌గా చూస్తారు" అని అలీ రెజా పేర్కొన్నాడు.

నయనం ఓటీటీ స్ట్రీమింగ్

ఇదిలా ఉంటే, అలీ రెజా కీలక పాత్ర పోషించిన జీ5లో నయనం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 19న జీ5లో తెలుగుతోపాటు ఇతర భాషల్లో నయనం ఓటీటీ రిలీజ్ కానుంది. నయనం ఓటీటీ సిరీస్‌లో వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్, అలీ రెజాతోపాటు ఉత్తేజ్, రేఖా నిరోషా ఇతర కీలక పాత్రలు పోషించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More