సీక్రెట్స్ చూసే కళ్ల డాక్టర్-నేరుగా ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సైకో థ్రిల్లర్ సిరీస్-అదిరిపోయిన ట్రైలర్-స్ట్రీమింగ్ డేట్ ఇదే
టాలీవుడ్ లో హీరోగా వరుస ఫ్లాప్ లు అందుకుంటున్న వరుణ్ సందేశ్ రూట్ మార్చాడు. ఇప్పుడు ఓటీటీ బాట పట్టాడు. నేరుగా ఓటీటీలోకి రాబోతున్న నయనం అనే సైకో సిరీస్ తో డిజిటల్ ఆడియన్స్ ను కలవడానికి వచ్చేస్తున్నాడు. ఇవాళ రిలీజ్ చేసిన ఈ సిరీస్ ట్రైలర్ అదిరిపోయింది.
ఓటీటీలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతుంది. ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేలా సస్పెన్స్, ఉత్కంఠతో కూడిన సిరీస్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అదే నయనం వెబ్ సిరీస్. ఇందులో వరుణ్ సందేశ్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. పెద్ద తెరపై విజయాలు అందుకోలేకపోతున్న వరుణ్.. రూటు మార్చి చిన్న తెరపైకి వస్తున్నాడు. ఇవాళ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది.
నయనం వెబ్ సిరీస్ పోస్టర్ (x/ZEE5Telugu)
ఓటీటీలో నయనం
సైకో థ్రిల్లర్ సిరీస్ గా తెరకెక్కిన నయనం వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. మంగళవారం (డిసెంబర్ 9) ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో వరుణ్ సందేశ్ షేడ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో డిసెంబర్ 19న నేరుగా రిలీజ్ కానుంది. ఇది 6 ఎపిసోడ్ల సిరీస్ గా రానుంది.
నయనం ట్రైలర్
హైదరాబాద్ లో ఇవాళ నయనం సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. యూట్యూబ్ లో రిలీజైన ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఈ సిరీస్ లో వరుణ్ సందేశ్ కంటి డాక్టర్ గా నటిస్తున్నాడు. ఇతరులు కళ్లద్దాల నుంచి నాలుగు నిమిషాల పాటు వాళ్లు చూసేది తాను చూడగలనని వరుణ్ క్యారెక్టర్ చెప్తుంది. అందుకోసం స్పెషల్ గా ఓ కళ్లద్దాలు డిజైన్ చేస్తాడు.
అమ్మాయితో లవ్
ఓ అమ్మాయి కళ్లను చూసి డాక్టర్ లవ్ లో పడతాడు. హీరోయిన్ గా బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ నటించింది. అయితే ఆమెకు భర్త ఉన్నడనే విషయం తెలుస్తుంది. అతను హత్యకు గురవుతాడు. ఈ హత్యను ఎంక్వైరీ చేయడానికి పోలీస్ ఆఫీసర్ గా అలీ రెజా రంగంలోకి దిగుతాడు. మరి ఆ హత్య చేసింది ఎవరు? వరుణ్ సందేశ్ దాచిన రహస్యాలు ఏంటీ? అన్నది సిరీస్ లో చూసి తెలుసుకోవాల్సిందే.
లేడీ డైరెక్టర్
నయనం వెబ్ సిరీస్ కు స్వాతి ప్రకాష్ డైరెక్టర్. సైకో థ్రిల్లర్ గా కనిపిస్తున్న ఈ సిరీస్ లో వరుణ్ సందేశ్, ఉత్తేజ్, ప్రియాంక జైన్, అలీ రెజా, రేఖ నిరోష, హరీష్ తదితరులు నటించారు. ఈ సిరీస్ ను ఎస్ఆర్టీ ఎంటర్ టైనర్స్ బ్యానర్ పై ఈ సిరీస్ ను రామ్ తళ్లూరి, రజనీ తళ్లూరి నిర్మించారు. మరి ఈ సిరీస్ తోనైనా వరుణ్ సందేశ్ రాత మారుతుందేమో చూడాలి. అతను సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.