...
...
Next Story

OTT Crime Thriller: రూ.17 కోట్ల బ్యాంకు దొంగతనం.. క్లర్క్ జీవితం తలకిందులు.. ఓటీటీలోకి మలయాళ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

OTT Crime Thriller: ఓటీటీలోకి మరో మలయాళం హైస్ట్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమా పేరు ఐ నోబడీ. స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ జియోహాట్‌స్టార్ లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Published on: Aug 17, 2026, 13:19:14 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Crime Thriller: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి పార్వతి తిరువోతు కాంబినేషన్లో వచ్చిన మైండ్ బ్లోయింగ్ హైస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'ఐ, నోబడీ' (I, Nobody) డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఎట్టకేలకు అఫీషియల్‌గా కన్ఫమ్ అయింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఈ పవర్‌ప్యాక్డ్ సోషల్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ వేదికగా ఆగస్టు 25 నుంచి ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

ఐదు భాషల్లో స్ట్రీమింగ్

OTT Crime Thriller: రూ.17 కోట్ల బ్యాంకు దొంగతనం.. క్లర్క్ జీవితం తలకిందులు.. ఓటీటీలోకి మలయాళ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
OTT Crime Thriller: రూ.17 కోట్ల బ్యాంకు దొంగతనం.. క్లర్క్ జీవితం తలకిందులు.. ఓటీటీలోకి మలయాళ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ కోసం జియోహాట్‌స్టార్ ఈ మూవీని ఒరిజినల్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి తెస్తోంది. "ఇకపై ఎవ్వరూ ఈ క్రేజీ థ్రిల్లర్‌ని మిస్ కాకూడదు" అనే క్యాప్షన్‌తో జియోహాట్‌స్టార్ ఓటీటీ సోషల్ మీడియాలో అనౌన్స్‌మెంట్ పోస్ట్ షేర్ చేసింది.

బ్యాంక్ రాబరీ కేసులో చిక్కుకున్న సామాన్యుడు

ఈ సినిమా కథ అంతా రాజీవన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) అనే ఒక సాధారణ మిడిల్ క్లాస్ గవర్నమెంట్ క్లర్క్ చుట్టూ తిరుగుతుంది. భార్య మీరా (పార్వతి తిరువోతు), ఇద్దరు ఆడపిల్లలతో సాఫీగా సాగిపోవాల్సిన అతని లైఫ్‌లో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెద్ద సమస్యగా మారతాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక రోజు రాజీవన్ ఉన్న వంచియూర్ ISFC బ్యాంక్ బ్రాంచ్‌లో దాదాపు 17 కోట్ల రూపాయల భారీ దొంగతనం జరుగుతుంది. ఆ రాబరీ సమయంలో ఊహించని పరిస్థితుల్లో దొంగల ముఠా చేతిలో బందీగా చిక్కుకున్న రాజీవన్ వాళ్లతో పాటు వెళ్లాల్సి వస్తుంది.

అయితే కారు యాక్సిడెంట్‌లో దొంగలందరూ చనిపోవడంతో, అసలు మాయమైన 17 కోట్ల రూపాయల క్యాష్ ఎక్కడికి పోయిందనే దానికి రాజీవనే ప్రధాన అనుమానితుడిగా మారిపోతాడు. ఒకవైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్, మరోవైపు పోయిన డబ్బు కోసం వెతుకుతున్న గ్యాంగ్‌స్టర్ల వేధింపులతో రాజీవన్ జీవితం తీవ్ర నరకంగా మారుతుంది.

థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్

గతంలో మమ్ముట్టితో 'రోర్షాక్' (Rorschach)లాంటి సైకలాజికల్ థ్రిల్లర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ నిసామ్ బషీర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సమీర్ అబ్దుల్ అందించిన స్క్రీన్‌ప్లే, గ్రిప్పింగ్ నరేషన్ ఫస్ట్ హాఫ్‌లో ఆడియన్స్‌ని సీటు అంచున కూర్చోబెడతాయి.

'ఎన్ను నింటె మొయిదీన్', 'టేక్ ఆఫ్' వంటి ఐకానిక్ హిట్ల తర్వాత పృథ్వీరాజ్, పార్వతి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ అయింది. రాజీవన్‌గా పృథ్వీరాజ్ ఇన్టెన్స్ యాక్టింగ్, మీరాగా పార్వతి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి మేజర్ హైలైట్‌గా నిలిచాయి.

బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ ఇలా..

పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, E4 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సుప్రియ మీనన్, ముకేష్ ఆర్ మెహతా, సివి సారథి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. హకీమ్ షాజహాన్, విజయరాఘవన్, అశోకన్, ఖాలిద్ రెహమాన్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.

జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమా థ్రిల్లింగ్ మూడ్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లగా, దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ, రమీజ్ ఎంబీ ఎడిటింగ్ వర్క్ విజువల్‌గా రిచ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయి.

జులై 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బిగ్ స్క్రీన్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే థియేటర్లలో మిస్సయిన ప్రేక్షకులకు, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఓటీటీ ప్రియులకి జియోహాట్‌స్టార్‌లో ఆగస్టు 25 నుంచి లభించే ఈ సినిమా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe