Malayalam Web series: ఓటీటీలోకి మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Malayalam Web series: ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. నకిలీ పాస్‌పోర్టుల తయారీ చుట్టూ తిరిగే ఈ సిరీస్ జీ5 ఓటీటీలోకి రానుంది. తాజాగా సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చే సినిమాలే కాదు వెబ్ సిరీస్‌లు కూడా ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. 'సీక్రెట్ స్టోరీస్ రోజ్లిన్' విజయవంతమైన తర్వాత.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమైంది. 'కాసరగోడ్ ఎంబసీ' (Kasaragod Embassy) పేరుతో తెరకెక్కిన ఈ జీ5 ఒరిజినల్ సిరీస్.. మార్చి 20 నుండి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కాసరగోడ్ ఎంబసీ వెబ్ సిరీస్ స్టోరీ ఇదే
మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాసరగోడ్ ఎంబసీ ఓ నకిలీ పాస్‌పోర్ట్ తయారీ ముఠా చుట్టూ తిరుగుతుంది. 2000వ దశకం నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్.. కేరళలోని కాసరగోడ్ జిల్లాలో జరిగే నకిలీ పాస్‌పోర్ట్ వ్యాపారాన్ని కళ్లకు కట్టేలా చూపించనుంది. అజి, చెమ్ము అనే ఇద్దరు యువకులు ఈ అక్రమ వ్యాపారంలోకి ఎలా ప్రవేశించారు? అసలు కంటే మెరుగ్గా ఉండేలా నకిలీ సర్టిఫికెట్లు, పాస్‌పోర్టులను వీరు ఎలా సృష్టిస్తారు? అనేది ప్రధానాంశం.
ట్రైలర్‌లో చూపించినట్లుగా.. "కాగితం మీద ముద్రించే ఏదైనా సరే.. అది సర్టిఫికెట్ అయినా, పాస్‌పోర్ట్ అయినా.. అసలును మించి డూప్లికేట్‌ను సృష్టించవచ్చు" అని ఒక మహిళా పాత్ర చెప్పే డైలాగ్ ఈ రాకెట్ లోతును తెలియజేస్తోంది. ఈ అక్రమ కార్యకలాపాలను ఛేదించేందుకు పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్, దానికి అడ్డుపడే విలన్ల మధ్య సాగే ఉత్కంఠభరిత పోరాటమే ఈ సిరీస్.
కాసరగోడ్ ఎంబసీ స్ట్రీమింగ్ వివరాలు
కాసరగోడ్ ఎంబసీ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ మొదలవుతుందని ఆ ఓటీటీ వెల్లడించింది. అయితే కేవలం మలయాళం ఆడియోతోనే ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ చూడాలనుకుంటే చూసేయొచ్చు.
అతీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో 'మార్కో' ఫేమ్ కబీర్ దుహాన్ సింగ్, అబు సలీమ్, గోవింద్ పాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సుధీష్, దీపక్ పరంబోల్, రోనీ డేవిడ్, దినేష్ ప్రభాకర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. హీరాజ్ పీహెచ్ ఈ సిరీస్‌కు కథ అందించగా, రతీష్ వేగ సంగీతం సమకూర్చారు.
మలయాళ సినిమా ప్రియుల కోసం ఈ వారం ఇప్పటికే రెండు సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ప్రకంపనం (Prakambanam) అనే హారర్ కామెడీ మూవీ ఈరోజు అంటే మార్చి 13 నుండి జీ5లో అందుబాటులో ఉంది. ఇక శుక్రన్ (Sukran)అనే మరో మూవీ కూడా శుక్రవారం నుండి సన్ నెక్స్ట్ (Sun NXT)లో స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


