Malayalam OTT: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెండేళ్లు కోమాలో ఉన్న యువకుడు అకస్మాత్తుగా మేల్కొంటే ఎలా ఉంటుంది? అది కూడా సాధారణంగా కాకుండా అసాధారణమైన వినికిడి శక్తితో (Super-hearing) కళ్ళు తెరిస్తే ఊహించని పరిణామాలు ఎలా ఉంటాయి? సరికొత్త సూపర్ నేచురల్ డార్క్ కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మలయాళ సినిమా 'ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్' (It's a Medical Miracle) ఓటీటీలోకి వచ్చేస్తోంది.
తెలుగులోనూ రెండు ఓటీటీల్లోకి..

మలయాళ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ష్యామిన్ గిరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నీలిన్ సంద్ర కథ అందించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదికలు మనోరమా మాక్స్ (ManoramaMax), సింప్లీ సౌత్ (SimplySouth) స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. థియేట్రికల్ రన్లో భిన్నమైన జోనర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమైంది.
ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ విశేషాలు
మూవీ పేరు : It's a Medical Miracle (ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్)
ఓటీటీ : ManoramaMax & SimplySouth (మనోరమా మాక్స్, సింప్లీ సౌత్)
భాషలు : మలయాళం, తెలుగు, కన్నడ, తమిళం
జానర్ : సూపర్ నేచురల్ డార్క్ కామెడీ థ్రిల్లర్
డైరెక్టర్ : ష్యామిన్ గిరీష్
నటీనటులు : సంగీత్ ప్రతాప్, షరాఫుద్దీన్, అఖిలా భార్గవన్
మ్యూజిక్ : ముజీబ్ మజేద్
రూబెన్ పాత్రలో సంగీత్ ప్రతాప్ అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్
ఈ చిత్రంలో రూబెన్ అనే పాత్రలో వర్ధమాన నటుడు సంగీత్ ప్రతాప్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. రీసెంట్గా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'ప్రేమలు' సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించిన సంగీత్.. ఈ చిత్రంలో పూర్తిగా సీరియస్ అండ్ ఇంటెన్స్ రోల్లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ప్రమాదం తర్వాత బ్రెయిన్ డెడ్ అనుకుని రెండు సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా లేచిన రూబెన్ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పవచ్చు.
{{/usCountry}}ఈ చిత్రంలో రూబెన్ అనే పాత్రలో వర్ధమాన నటుడు సంగీత్ ప్రతాప్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. రీసెంట్గా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'ప్రేమలు' సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించిన సంగీత్.. ఈ చిత్రంలో పూర్తిగా సీరియస్ అండ్ ఇంటెన్స్ రోల్లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ప్రమాదం తర్వాత బ్రెయిన్ డెడ్ అనుకుని రెండు సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా లేచిన రూబెన్ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పవచ్చు.
{{/usCountry}}ఆయనతో పాటు మరో కీలక పాత్రలో కనిపించిన వర్సటైల్ యాక్టర్ షరాఫుద్దీన్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్లు ఆడియన్స్‌ని కట్టిపడేస్తాయి. అఖిల భార్గవన్ హీరోయిన్గా నటించి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.
టెక్నికల్ బ్రిలియన్స్ హైలైట్
ఈ సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్ 'పాయింట్ ఆఫ్ హియరింగ్' (POH) సౌండ్ డిజైన్. కోమా నుంచి బయటపడిన హీరోకి అతి సూక్ష్మమైన శబ్దాలు కూడా స్పష్టంగా వినిపించే ఆ అసాధారణ మానసిక స్థితిని టెక్నికల్ టీమ్ చాలా గ్రిప్పింగ్‌గా డిజైన్ చేసింది. ముజీబ్ మజేద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌ను పూర్తిగా మార్చేస్తుంది.
డాక్టర్ పాల్స్ ఎంటర్టైన్మెంట్, డ్రీమ్ బిగ్ ఫిలిమ్స్ బ్యానర్లపై భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందించారు. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే పరుగులు పెట్టినా, సెకండ్ హాఫ్‌లో కొన్ని చోట్ల వేగం తగ్గినా ఓవరాల్‌గా ఈ డిఫరెంట్ థ్రిల్లర్ వీకెండ్లో పర్ఫెక్ట్ బింజ్ వాచ్ ఆప్షన్ అవుతుంది.