మలయాళ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చే వైవిధ్యమైన చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరణ ఉంటుంది. తాజాగా థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన మలయాళ హారర్ కామెడీ మూవీ 'ప్రకంపనం' (Prakambanam) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై అలజడి సృష్టించేందుకు సిద్ధమైంది. యువ నటులు గణపతి, సాగర్ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ త్వరలో జీ5 (ZEE5) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే స్ట్రీమింగ్ డేట్ ను మాత్రం జీ5 ఇంకా వెల్లడించలేదు.
'ప్రకంపనం' స్టోరీ ఇదే

విజేష్ పనత్తూరు దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ హారర్ కామెడీ మూవీ ప్రకంపనం. ఇది ముగ్గురు జాలీగా తిరిగే కాలేజీ కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఎటువంటి బాధ్యత లేకుండా లైఫ్ ఎంజాయ్ చేసే వీరి జీవితాల్లో ఒక అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది. వారిలో ఒకరి శరీరంలోకి ఒక బామ్మ ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆ కుర్రాళ్లు పడే ఇబ్బందులు, ఆ ఆత్మ చేసే హంగామా ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంది.
సీనియర్ నటి మల్లికా సుకుమారన్ ఆత్మగా నటించిన బామ్మ పాత్రలో అద్భుతంగా మెప్పించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే కన్నుమూసిన దివంగత నటుడు కళాభవన్ నవాస్ కూడా ఇందులో నటించడం విశేషం. రాజేష్ మాధవన్, అజీస్ నెడుమంగడ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
ప్రకంపనం ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
ఈ ఏడాది జనవరి 30న థియేటర్లలో విడుదలైన ‘ప్రకంపనం’.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. కేవలం సరదాగా, మైండ్ ఫ్రీగా నవ్వుకోవాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 ఓటీటీ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది. అయితే స్ట్రీమింగ్ తేదీని మాత్రం చెప్పలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు.
ఇప్పటికే థియేటర్లలో రిలీజై ఆరు వారాలు దాటింది. దీంతో ఈ మార్చి నెల చివరిలోగా ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి కేవలం మలయాళం ఆడియోతోనే అందుబాటులోకి రానుంది. మరోవైపు జీ5 ఓటీటీయే ఇదే నెల అంటే మార్చి 20న 'కాసరగోడ్ ఎంబసీ' అనే మలయాళ వెబ్ సిరీస్ను కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
{{/usCountry}}ఇప్పటికే థియేటర్లలో రిలీజై ఆరు వారాలు దాటింది. దీంతో ఈ మార్చి నెల చివరిలోగా ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి కేవలం మలయాళం ఆడియోతోనే అందుబాటులోకి రానుంది. మరోవైపు జీ5 ఓటీటీయే ఇదే నెల అంటే మార్చి 20న 'కాసరగోడ్ ఎంబసీ' అనే మలయాళ వెబ్ సిరీస్ను కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
{{/usCountry}}