ప్రేమమ్ హీరో గుర్తున్నాడా? ఈ సెన్సేషన్ రొమాంటిక్ డ్రామాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటుడు నివిన్ పాలీ. చాలా రోజులుగా ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్న అతనికి సర్వం మాయ రూపంలో ఓ బ్లాక్‌బస్టర్ దక్కింది. గతేడాది చివర్లో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
సర్వం మాయ ఓటీటీ రిలీజ్ డేట్

గతేడాది క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో రిలీజైన మలయాళ హారర్ కామెడీ మూవీ సర్వం మాయ (Sarvam Maya). ఈ సినిమా జనవరి 30 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రస్తుతానికి కేవలం మలయాళ వెర్షనే రానుండటం కాస్త నిరాశ కలిగించేదే.
కానీ త్వరలోనే ఇతర భాషల గురించి కూడా ఆ ఓటీటీ సమాచారం ఇవ్వనుంది. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సర్వం మాయ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఈ మూవీ రూ.144 కోట్లు వసూలు చేసింది. ఇక ఐఎండీబీలోనూ 8 రేటింగ్ సొంతం చేసుకోవడం చూస్తుంటే ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతలా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
సర్వం మాయ సినిమా హైలైట్స్
నివిన్ పాలీ లీడ్ రోల్లో నటించిన ఈ సర్వం మాయ ఓ హారర్ కామెడీ. ప్రభేందు నంబూతిరి (నివిన్ పాలీ) అనే వ్యక్తికి తన సొంత ఊరిలో ఒక దెయ్యంతో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళ మధ్య జరిగే ఫన్నీ, భయపెట్టే సంఘటనలే ఈ సినిమా కథ.
ఇందులో రియా షిబు (డెలూలు పాత్రలో), అజు వర్గీస్, జనార్దనన్ కూడా నటించారు. నివిన్-అజు వర్గీస్ కామెడీ కాంబినేషన్ ఈ సినిమాకు ప్రధాన బలం. 2025లో మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో (లోకా, ఎంపురాన్, తుడరుమ్) ఈ 'సర్వం మాయ' చేరిపోయింది.
{{/usCountry}}ఇందులో రియా షిబు (డెలూలు పాత్రలో), అజు వర్గీస్, జనార్దనన్ కూడా నటించారు. నివిన్-అజు వర్గీస్ కామెడీ కాంబినేషన్ ఈ సినిమాకు ప్రధాన బలం. 2025లో మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో (లోకా, ఎంపురాన్, తుడరుమ్) ఈ 'సర్వం మాయ' చేరిపోయింది.
{{/usCountry}}అలాంటి సినిమా ఇప్పుడు జియోహాట్‌స్టార్ లోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. ఇప్పటికే నివిన్ పాలీ నటించిన ఫార్మా అనే వెబ్ సిరీస్ ఇదే ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ను తెలుగులోనూ చూడొచ్చు.