ఈవారం ఓటీటీలోకి వస్తున్న మలయాళం హారర్ థ్రిల్లర్ మిస్ కావద్దు.. మోహన్‌లాల్ తనయుడి సూపర్ హిట్ మూవీ
ఓటీటీలోకి ఈవారం ఓ ఇంట్రెస్టింగ్ మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ప్రముఖ నటుడు మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఓటీటీలోకి ఈవారం వస్తున్న మలయాళం సినిమాల్లో ఓ హారర్ థ్రిల్లర్ ఎంతో ఆసక్తి రేపుతోంది. అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ.82 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా పేరు డైస్ ఇరే (Dies Irae). మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించాడు. ఈ సినిమా జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

డైస్ ఇరే ఓటీటీ రిలీజ్ డేట్
ఈ ఏడాది ఎన్నో బ్లాక్‌బస్టర్ మలయాళం మూవీస్ వచ్చాయి. అందులో ఒకటి ఈ హారర్ థ్రిల్లర్ మూవీ డైస్ ఇరే. ఈ సినిమాను ఈ శుక్రవారం అంటే డిసెంబర్ 5 నుంచి జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేయనుంది. మలయాళంతో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.3 రేటింగ్ నమోదైంది. ఇప్పుడు ఐదు భాషల్లో డిజిటల్ ప్రీమియర్ కానుండటంతో ఓటీటీలో మరింత ఆదరణ లభించే అవకాశం ఉంది.
డైస్ ఇరే మూవీ గురించి..
ఆత్మ, ప్రతీకారం అనే అంశాల చూట్టూ సాగే సినిమానే డైస్ ఇరే. ఇందులో రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్) ఓ ఆర్కిటెక్ట్. అతనిది రిచ్ ఫ్యామిలీ. పేరేంట్స్ అమెరికాలో ఉంటారు. రోహన్ ఇక్కడ ఇండియాలో ఓ పెద్ద ఇంట్లో ఒంటరిగానే ఉంటాడు. ఒక రోజు అతని క్లాస్ మేట్ కని (నర్తకి) సూసైడ్ చేసుకుంటుంది. ఆ ఫ్యామిలీని పరామర్శించేందుకు రోహన్ వాళ్ల ఇంటికి వెళ్తాడు.
కని రూమ్ లో ఉన్న ఓ రెడ్ కలర్ హెయిర్ క్లిప్ ను రోహన్ తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. అప్పటి నుంచే రోహన్ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతాయి. ఏదో ఆత్మ తనను వెంటాడుతున్నట్లే అనిపిస్తుంది. అది కని ఆత్మ అని రోహన్ అనుకుంటాడు. కని బ్రదర్ కిరణ్ ఓసారి రోహన్ ఇంటికి వస్తాడు. అతన్ని పై అంతస్తు నుంచి కిందకు తోసేస్తుంది ఓ రహస్య శక్తి.
మరి ఆ ఆత్మ ఎవరిది? కనిని ప్రేమించిన ఫిలిప్ కు ఈ కథకు సంబంధం ఏంటీ? క్లైమాక్స్ లో వచ్చే సూపర్ ట్విస్ట్ ఏంటీ? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాను భ్రమయుగం ఫేమ్ రాహుల్ సదాశివన్ డైరెక్ట్ చేయగా.. ప్రణవ్ మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


