ఓటీటీలోకి మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ.. పాడుబడిన భవంతిలో దాగి ఉన్న రహస్యాలు.. ఇక్కడ చూడండి

ఓటీటీలోకి ఓ మలయాళం హారర్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఆరు నెలల కిందట థియేటర్లో రిలీజైన ఈ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కు ఈ మూవీ సిద్ధమైంది. ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో లీడ్ రోల్లో నటించాడు.

Published on: Feb 12, 2026, 17:38:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ 'ది ప్రొటెక్టర్' (The Protector). థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా.. దాదాపు ఆరు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. మనోరమ మ్యాక్స్ (Manorama Max) వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీలోకి మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ.. పాడుబడిన భవంతిలో దాగి ఉన్న రహస్యాలు.. ఇక్కడ చూడండి
ఓటీటీలోకి మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ.. పాడుబడిన భవంతిలో దాగి ఉన్న రహస్యాలు.. ఇక్కడ చూడండి

ది ప్రొటెక్టర్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

మలయాళంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ 'ది ప్రొటెక్టర్' త్వరలో ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. థియేటర్ రిలీజ్ సమయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ.. ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాను మనోరమ మ్యాక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. అయితే ఇప్పటి వరకూ రిలీజ్ డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కానీ అతి త్వరలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

ది ప్రొటెక్టర్ కథేంటంటే..

ది ప్రొటెక్టర్ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఇది ఉత్తర మలబార్‌లోని 'మనక్కల్ మన' అనే పాడుబడిన భవంతి చుట్టూ తిరుగుతుంది. ఈ భవనం చుట్టూ అలుముకున్న రహస్యాలే ఈ సినిమా కథాంశం. బ్రిటీష్ కాలం నాటి నుంచి అక్కడ అనేక వింత కథలు ప్రచారంలో ఉంటాయి.

అయితే ఈ మధ్య కాలంలో అక్కడ జరిగిన కొన్ని ఘోరమైన విపత్తుల వెనుక ఉన్న నిజాలను వెలికితీయడానికి సీఐ సత్య (షైన్ టామ్ చాకో) అక్కడికి వస్తాడు. ఆ మిస్టరీని సత్య ఎలా ఛేదించాడు? అక్కడ దాగి ఉన్న అసలు నిజాలేంటి? అనేదే ఈ సినిమా కథ. కాన్హంగాడ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది.

ది ప్రొటెక్టర్ మూవీ నటీనటులు, ఇతర విశేషాల విషయానికి వస్తే.. జి.ఎం. మను (G M Manu) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డయానా హమీద్ హీరోయిన్‌గా నటించింది. తలైవాసల్ విజయ్, మొట్టై రాజేంద్రన్, బోబన్ అలుమూడన్, ఉన్ని రాజా, మణికంఠన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జినోష్ ఆంటోనీ సంగీతం అందించాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More