Today OTT: హాస్పిటల్లో పసికందు మిస్సింగ్.. 24 గంటల కథ..ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం మెడికల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

ఓటీటీలో మలయాళ థ్రిల్లర్లకు భలే క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి మరో మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చింది. హాస్పిటల్లో పసికందు మిస్సింగ్ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఇది సస్పెన్స్ తో సాగే మెడికల్ క్రైమ్ థ్రిల్లర్. 

Published on: Feb 12, 2026 8:48 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అదిరే ట్విస్ట్ లతో, ఉత్కంఠ రేపే సస్పెన్స్ తో సాగే మలయాళ సినిమా ‘బేబీ గర్ల్’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మెడికల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఈ రోజు నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంట్ గా సర్వం మాయ అనే హారర్ కామెడీ థ్రిల్లర్ తో అదరగొట్టిన నివిన్ పాలీ ఈ బేబీ గర్ల్ మూవీలో లీడ్ రోల్ ప్లే చేశాడు.

ఓటీటీలోకి మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ (x/SonyLIV)
ఓటీటీలోకి మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ (x/SonyLIV)

బేబీ గర్ల్ ఓటీటీ

ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు మరో మలయాళ థ్రిల్లర్ వచ్చేసింది. మెడికల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరెకెక్కిన ‘బేబీ గర్ల్’ ఇవాళ (ఫిబ్రవరి 12) ఓటీటీలో రిలీజైంది. గురువారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ఈ మూవీ వచ్చేసింది.

21 రోజులకే

థియేటర్లలో రిలీజైన తర్వాత 21 రోజులకే బేబీ గర్ల్ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా జనవరి 23న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఫిబ్రవరి 12 నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో నివిన్ పాలీ, లిజోమోల్ జోస్, సంగీత్ ప్రతాప్, అభిమన్యు తదితరులు నటించారు. ఈ సినిమాకు అరుణ్ వర్మ డైరెక్టర్.

మూవీ రిజల్ట్

సర్వం మాయ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నివిన్ పాలీ హీరోగా వచ్చిన మూవీ బేబీ గర్ల్. భారీ అంచనాలతో ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. కానీ రిజల్ట్ మాత్రం నెగెటివ్ గా వచ్చింది. రూ.12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన బేబీ గర్ల్ సినిమా ఓవరాల్ గా యావరేజ్ గా నిలిచిపోయింది. ఇది 24 గంటల వ్యవధిలోనే సాగే కథతో కూడిన సినిమా.

బేబీ గర్ల్ స్టోరీ

మూడు రోజుల వయసున్న పసికందు మిస్సింగ్ చుట్టూ బేబీ గర్ల్ మూవీ స్టోరీ తిరుగుతోంది. తిరువనంతపురంలోని గుడ్ షెపర్డ్ హాస్పిటల్ నుంచి ఓ పసికందు మాయమవుతుంది. ఈ మిస్సింగ్ కేసు సాల్వ్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగుతారు. అదే హాస్పిటల్ లో సనల్ మాథ్యూ (నివిన్ పాలీ) అటెండర్ గా పని చేస్తాడు. పాప కనిపించకుండా పోయిన రోజు సనల్ లేటుగా డ్యూటీకి వస్తాడు.

కాలేజీ స్టూడెంట్స్

పాప మిస్సింగ్ కేసులో సనల్ ను పోలీసులు అనుమానిస్తారు. అయితే పాపను తీసుకుని ఓ వ్యక్తి వెళ్లడం తాను చూశానని సనల్ చెప్తాడు. తన మీద పడ్డ నిందను తొలగించుకోవడం కోసం పాపను వెతుకుతాడు. మరోవైపు ఈ పాప తల్లిదండ్రులకు 19 ఏళ్లే ఉంటాయి. వీళ్లు కాలేజీ స్టూడెంట్స్. పాప విషయం బయటకు తెలిస్తే ఎలా అని భయపడతారు.

మరోవైపు రీతుకు అప్పటికే ఓ బిడ్డ పుట్టి చనిపోతుంది. ఆ బాధతోనే బిడ్డ కావాలని తపన పడుతుంది. మరి హాస్పిటల్ నుంచి పాపను ఎవరు తీసుకెళ్లారు? ఇందులో రితు పాత్ర ఏంటీ? అన్నది బేబీ గర్ల్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.