మలయాళం మిస్టరీ థ్రిల్లర్ సినిమా లవర్స్ కు గుడ్ న్యూస్. ఓటీటీలోకి ఈవారం మరో ఇంట్రెస్టింగ్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమాను సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. గత నెల 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సుమారు నెలన్నర రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం.
నిధియుమ్ భూతవుమ్ ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళంలో వచ్చిన లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ నిధియుమ్ భూతవుమ్. ఈ సినిమా బుధవారం (డిసెంబర్ 24) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది.
“గతం మౌనంగా ఉండటానికి నిరాకరించినప్పుడు.. నిధియుమ్ భూతవుమ్ రేపటి నుంచి సన్ నెక్ట్స్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. దీనికి మూవీలోని ఓ చిన్న వీడియోను జోడించింది.
నిధియుమ్ భూతవుమ్ మూవీ గురించి..
నిధియుమ్ భూతవుమ్ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రిలీజైంది. అనీష్ జీ మేనన్ ఇందులో లీడ్ రోల్లో నటించాడు. సాజన్ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. టూ-వీలర్ వర్క్‌షాప్ నడుపుకునే ముగ్గురు యువకులు ఒక దెయ్యాల కొంపలో చిక్కుకునే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందింది.
'నిధియుం భూతవుం' (నిధి, భూతం అని అర్థం) పేరుతో తెరకెక్కిన ఈ సినిమా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీలోకి వస్తోంది. సినిమా కథ ప్రధానంగా ముగ్గురు యువకుల చుట్టూ తిరుగుతుంది.
వీరు ముగ్గురూ కలిసి ఒక టూ-వీలర్ వర్క్‌షాప్ (మెకానిక్ షెడ్) నడుపుతుంటారు. అనుకోని పరిస్థితుల్లో వీరు ఒక ‘హోమ్‌స్టే’కు మకాం మారుస్తారు. అయితే ఆ ఇల్లు మామూలు ఇల్లు కాదు. అక్కడ దెయ్యాలు సంచరిస్తాయని స్థానికులు నమ్ముతుంటారు. ఆ ఇంట్లోకి వెళ్ళాక ఆ కుర్రాళ్ల జీవితంలో ఎలాంటి వింత సంఘటనలు, మిస్టరీ ఘటనలు జరిగాయన్నదే ఈ సినిమా కథ.
ఈ సినిమాలో నైరా నిహార్, విష్ణు గోవిందన్, వైకోమ్ భాసి, పాల్సన్, గోకులన్, రాధా గోమతి, రేష్మి అనిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
{{/usCountry}}ఈ సినిమాలో నైరా నిహార్, విష్ణు గోవిందన్, వైకోమ్ భాసి, పాల్సన్, గోకులన్, రాధా గోమతి, రేష్మి అనిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
{{/usCountry}}