Malayalam OTT: ఓటీటీలోకి ఒకే రోజు రెండు బ్లాక్‌బస్టర్ మలయాళం సినిమాలు.. ఒకటి డార్క్ థ్రిల్లర్, మరొకటి కామెడీ డ్రామా
Malayalam OTT: ఓటీటీలో ఈవారం ఒకే రోజు రెండు మలయాళం బ్లాక్‌బస్టర్ సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఒకటి డార్క్ కామెడీ థ్రిల్లర్ కాగా.. మరొకటి కామెడీ డ్రామా. ఇవి నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.
Malayalam OTT: ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు మలయాళ ఇండస్ట్రీ నుండి రెండు భారీ బ్లాక్‌బస్టర్లు అలరించనున్నాయి. ఇది రెండూ సీక్వెల్స్ కావడం విశేషం. కేరళ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన 'వాలా 2', 'భరతనాట్యం 2 మోహినియాట్టం' ఈ శుక్రవారం (మే 8) డిజిటల్ వేదికలపై అడుగుపెట్టనున్నాయి. ఈ రెండు చిత్రాలు బహుభాషల్లో అందుబాటులోకి రానుండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా వీటిని చూడొచ్చు.

మలయాళ ఇండస్ట్రీ నయా హిట్: 'వాలా 2'
గతేడాది వచ్చిన 'వాలా' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన 'వాలా 2' కేరళలో సంచలనం సృష్టించింది. కేవలం మలయాళంలోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం ఈ సినిమా గురించి చర్చించుకునేలా చేసింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లకుపైగా వసూలు చేసింది.
కేరళలో అత్యధిక వసూళ్ల మలయాళం మూవీగా నిలిచింది. అలాంటి మూవీ ఈ శుక్రవారం (మే 8) నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ ప్రధాన పాత్రల్లో నటించారు. డెబ్యూ డైరెక్టర్ సవిన్ ఎస్.ఏ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
డార్క్ కామెడీ థ్రిల్లర్: 'భరతనాట్యం 2 మోహినియాట్టం'
మలయాళ స్టార్ నటుడు సాయిజు కురుప్ ప్రధాన పాత్రలో నటించిన 'భరతనాట్యం 2 మోహినియాట్టం' బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ 2024లో వచ్చిన 'భరతనాట్యం' చిత్రానికి సీక్వెల్. డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా రూ. 40 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. మే 8 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంటుంది. సాయిజు కురుప్, సూరజ్ వెంజరమూడు, జగదీష్, వినయ్ ఫోర్ట్ వంటి వెటరన్ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. కృష్ణదాస్ మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'వాలా 2' ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది?
మలయాళ ఇండస్ట్రీ హిట్ 'వాలా 2' మే 8 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
2. ఈవారం మలయాళ సినిమాలు తెలుగులో కూడా అందుబాటులో ఉంటాయా?
అవును. 'వాలా 2', 'భరతనాట్యం 2' రెండు చిత్రాలు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మే 8 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
3. 'భరతనాట్యం 2 మోహినియాట్టం' ఎక్కడ చూడవచ్చు?
ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్‌ను మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.
4. ఈ వారంలో విడుదలయ్యే ఇతర క్రేజీ ఓటీటీ ప్రాజెక్టులు ఏమిటి?
మే 6న ప్రియాంక చోప్రా 'సిటాడెల్ 2' (ప్రైమ్ వీడియో), మే 8న అడివి శేష్ 'డెకాయిట్' (నెట్‌ఫ్లిక్స్) కూడా విడుదలవుతున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


