Vaazha 2 OTT Release Date: 220 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలోకి.. తెలుగులో రిలీజైన రెండు వారాల్లోనే..

Vaazha 2 OTT Release Date: ఓటీటీలోకి మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ వాలా 2 స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. తెలుగులో థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోపే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానుంది. మే 8 నుంచి జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు.

Published on: May 1, 2026, 13:58:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vaazha 2 OTT Release Date: మలయాళం నుంచి ఈ ఏడాది వచ్చి ఏకంగా రూ.220 కోట్లు వసూలు చేసిన సినిమా వాలా 2. కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. గత నెల చివరి వారంలో తెలుగులోనూ రిలీజైంది. ఇప్పుడీ మూవీ డిజిల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

Vaazha 2 OTT Release Date: 220 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలోకి.. తెలుగులో రిలీజైన రెండు వారాల్లోనే..
Vaazha 2 OTT Release Date: 220 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలోకి.. తెలుగులో రిలీజైన రెండు వారాల్లోనే..

వాలా 2 ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు

మలయాళ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం వైవిధ్యమైన కథలతో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. అలాంటి ఇండస్ట్రీ నుంచి తాజాగా వచ్చిన 'వాలా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' (Vaazha II: Biopic of a Billion Bros) డిజిటల్ స్ట్రీమింగ్‌ కానుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) మే 8 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఒకప్పుడు కేవలం మలయాళ ప్రేక్షకులకు మాత్రమే పరిమితమైన ఇలాంటి సినిమాలు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులకు కూడా దగ్గరవుతున్నాయి. ముఖ్యంగా స్నేహం, హాస్యం, ఎమోషన్స్‌తో కూడిన కథాంశం కావడంతో 'వాలా 2' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

"బ్రోస్ ఆర్ బ్యాక్ బై డిమాండ్" అంటూ జియోహాట్‌స్టార్ తన సోషల్ మీడియాలో పోస్టర్లను విడుదల చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మలయాళ సినిమాలకు ఉండే సహజత్వం ఈ సినిమాలో కూడా కనిపిస్తుందని, యువతకు ఈ కథ బాగా కనెక్ట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మీరు ఒకవేళ మంచి కామెడీ ఎంటర్టైనర్ కోసం చూస్తుంటే.. మే 8న మీ వాచ్ లిస్ట్‌లో ఈ సినిమాను చేర్చుకోవచ్చు.

వాలా 2 మూవీ విశేషాలు

వాలా 2 మూవీ ఏప్రిల్ 2న మలయాళంలో రిలీజై సంచలన విజయం సాధించింది. ఆ సినిమాను తెలుగులో ఏప్రిల్ 24న సాహు గారపాటి థియేటర్లలో రిలీజ్ చేశారు. అంటే తెలుగులో రిలీజైన రెండు వాారాల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీని తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రమోట్ చేయడం విశేషం. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లు వసూలు చేసింది. ఐఎండీబీలోనూ 8.3 రేటింగ్ సొంతం చేసుకుంది.

నలుగురు స్నేహితుల భావోద్వేగ ప్రయాణం..

ముగ్గురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు హషీర్, అలెన్, వినాయక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా.. నలుగురు సామాన్య యువకుల జీవితాల్లోని ఒడిదుడుకులను, స్నేహాన్ని ఎంతో సహజంగా ఆవిష్కరించింది. దర్శకుడు సావిన్ ఎస్.ఏ దీనిని ప్రతి ఒక్కరూ తమ జీవితానికి రిలేట్ చేసుకునేలా మలిచారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. వాలా 2 సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంటుంది?

ఈ సినిమా మే 8వ తేదీ నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

2. వాలా 2 స్టోరీ ఏంటి?

ఇది నలుగురు స్నేహితుల జీవితాల్లోని సరదా సంఘటనలు, భావోద్వేగాల సమాహారం. అందుకే దీనిని 'బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' అని పిలుస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More