Vaazha 2 Collections: ఎలాంటి అగ్ర హీరోలు లేరు- 16 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్- సూపర్ స్టార్ మూవీ రికార్డ్ కనుమరుగు!

Vaazha 2 Box Office Collection: స్టార్ పవర్ లేకపోయినా, కేవలం కంటెంట్ నమ్ముకుని బాక్సాఫీస్ వద్ద కేరళ కుర్రాళ్లు సంచలనం సృష్టిస్తున్నారు. 'వాళ 2' చిత్రం కేవలం 16 రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును దాటి మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర లిఖించింది. మరి వాళ 2 బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలు చూద్దాం.

Published on: Apr 19, 2026, 06:43:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vaazha 2 Box Office Record: మలయాళ చిత్ర పరిశ్రమ మరోసారి తన సత్తా చాటింది. భారీ బడ్జెట్, అగ్ర హీరోలు లేకపోయినా.. కథలో దమ్ముంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని 'వాళ 2: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్' సినిమా నిరూపించింది. సావిన్ ఎస్.ఏ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేరళ బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది.

ఎలాంటి అగ్ర హీరోలు లేరు- 16 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్- సూపర్ స్టార్ మూవీ రికార్డ్ కనుమరుగు!
ఎలాంటి అగ్ర హీరోలు లేరు- 16 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్- సూపర్ స్టార్ మూవీ రికార్డ్ కనుమరుగు!

100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి

విడుదలైన 16 రోజుల్లోనే కేరళలో వాళ 2 రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సినిమా ఇప్పటికే రూ. 200 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉండటం విశేషం.

తెలుగులో 'ప్రేమలు', 'మంజుమ్మెల్ బాయ్స్' వంటి చిన్న సినిమాలు ఎలాగైతే సెన్సేషన్ క్రియేట్ చేశాయో, ఇప్పుడు 'వాళ 2' కూడా అదే బాటలో సాగుతోంది. కేవలం తొలి వారంలోనే రూ. 55 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, 17వ రోజు నాటికి రూ. 101.85 కోట్ల మైలురాయిని చేరుకుంది.

మోహన్ లాల్ రికార్డులు సైతం కనుమరుగు

ఈ సినిమా సాధించిన ఘనత సామాన్యమైనది కాదు. గతంలో మలయాళ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన 'తుడరుమ్' (19 రోజులు), కల్యాణి ప్రియదర్శన్ నటించిన 'లోక చాప్టర్ 1 చంద్ర' (24 రోజులు) పేరిట ఉన్న రికార్డులను 'వాళ 2' తిరగరాసింది. కేరళ బాక్సాఫీస్ చరిత్రలో అత్యంత వేగంగా రూ. 100 కోట్లు వసూలు చేసిన చిత్రంగా ఇది అగ్రస్థానానికి చేరుకుంది.

"ఇది కేవలం మా విజయం కాదు, ప్రేక్షకులందరి విజయం. మీరిచ్చిన ప్రోత్సాహంతోనే 'వాళ 2' ఈ స్థాయికి చేరింది" అని రచయిత విపిన్ దాస్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

కుర్రాళ్ల గోల.. కనెక్ట్ అయిన ఆడియెన్స్

స్కూల్ లైఫ్ నుంచి అడల్ట్‌హుడ్‌లోకి అడుగుపెట్టే నలుగురు స్నేహితుల కథే ఈ 'వాళ 2'. సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు, చదువులో ఇబ్బందులు, కుటుంబ సభ్యుల అంచనాల మధ్య నలిగిపోయే హషీర్, అలన్, అజిన్, వినాయక్ అనే నలుగురు యువకుల ప్రయాణాన్ని దర్శకుడు వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు.

ఈ పాత్రల్లో నటించిన నటీనటులంతా కొత్తవారే అయినప్పటికీ, వారు పండించిన కామెడీ, ఎమోషన్ యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు వంటి సీనియర్ నటులు సపోర్టింగ్ రోల్స్‌లో మెరిశారు. ప్రతి సామాన్య యువకుడు తన జీవితాన్ని ఈ సినిమాలో చూసుకోవడమే దీని సక్సెస్ సీక్రెట్.

త్వరలో 'వాళ 3'.. ఈసారి లేడీ గ్యాంగ్‌తో!

ఈ చిత్రం సాధించిన భారీ విజయంతో మేకర్స్ ఇప్పటికే మూడవ భాగం 'వాళ 3'ని ప్రకటించారు. అయితే ఈసారి ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. ఇప్పటివరకు అబ్బాయిల స్నేహం చుట్టూ తిరిగిన ఈ ఫ్రాంచైజీ, మూడవ భాగంలో పూర్తిగా మహిళా ప్రధాన తారాగణంతో రాబోతోంది. కొత్త ప్రతిభను వెండితెరకు పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ వాళ సిరీస్ కొనసాగుతుందని విపిన్ దాస్ స్పష్టం చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More