...
...
Next Story

ఈవారం ఓటీటీలోకి రాబోతున్న ఈ 3 మలయాళం సినిమాలు మిస్ కావద్దు.. రూ.300 కోట్ల బ్లాక్‌బస్టర్ కూడా..

ఓటీటీలోకి ఈవారం కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిని ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు. వీటిలో రూ.300 కోట్ల బ్లాక్‌బస్టర్ సినిమా కూడా ఉంది.

Published on: Oct 29, 2025, 05:30:17 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీలోకి ప్రతివారం లాగే ఈవారం కూడా కొన్ని మంచి మలయాళం సినిమాలు వస్తున్నాయి. వీటిలో తొలి ఫిమేల్ సూపర్ హీరో మూవీ లోకా: ఛాప్టర్ 1తోపాటు మరో రెండు మూవీస్ కూడా ఉన్నాయి. మరి వీటిని ఎక్కడ, ఎప్పుడు చూడాలన్న వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

లోకా ఛాప్టర్ 1 చంద్ర - జియోహాట్‌స్టార్

ఈవారం ఓటీటీలోకి రాబోతున్న ఈ 3 మలయాళం సినిమాలు మిస్ కావద్దు.. రూ.300 కోట్ల బ్లాక్‌బస్టర్ కూడా..
ఈవారం ఓటీటీలోకి రాబోతున్న ఈ 3 మలయాళం సినిమాలు మిస్ కావద్దు.. రూ.300 కోట్ల బ్లాక్‌బస్టర్ కూడా..

మలయాళం ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ లోకా ఛాప్టర్ 1 చంద్ర ఈవారమే ఓటీటీలోకి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా.. ఇప్పుడు జియోహాట్‌స్టార్ లోకి వస్తోంది. ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 31 నుంచి ఏడు భాషల్లో ఈ మూవీని చూడొచ్చు.

కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ లీడ్ రోల్స్ లో నటించారు. మలయాళం ఇండస్ట్రీలో రూ.300 కోట్ల మార్క్ దాటిన తొలి సినిమాగా నిలిచిన ఈ లోకా మూవీ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో కొత్త లోక పేరుతో ఈ సినిమా వచ్చింది.

తలవర - ప్రైమ్ వీడియో

ప్రముఖ మలయాళ నటుడు అర్జున్ అశోకన్ నటించిన మూవీ తలవర. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఇప్పుడు ప్రైమ్ వీడియోలోకి వస్తోంది. బుధవారం (అక్టోబర్ 29) నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అర్జున్ అశోకన్ తోపాటు అభిరామ్ రాధాకృష్ణన్, దేవదర్శిని చేతన్, అశ్వత్ లాల్, రేవతి శర్మలాంటి వాళ్లు నటించారు. విటిలిగో అనే చర్మ సమస్యతో బాధపడే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది.

మధురం జీవామృత బిందు - సైనా ప్లే

ఈ మూడు సినిమాలే కాకుండా అంజామ్ వేదమ్ అనే సినిమా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీని మనోరమ మ్యాక్స్ ఓటీటీలో చూడొచ్చు. ఇక వీటితోపాటు కాంతార ఛాప్టర్ 1, ఇడ్లీ కడాయ్ లాంటి హిట్ సినిమాలు కూడా మలయాళంలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe