ఒకే రోజు ఓటీటీలోకి రెండు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలు.. మలయాళం సూపర్ హీరో మూవీ.. కన్నడ యాక్షన్ థ్రిల్లర్

ఓటీటీలోకి ఈవారం ఒకే రోజు రెండు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఒకటి మలయాళం సూపర్ హీరో సినిమా కాగా.. మరొకటి కన్నడ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. మరి వీటిని ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

Published on: Oct 27, 2025, 22:10:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈవారం ఓటీటీ అభిమానులకు పండగే. ఎందుకంటే ఈ ఏడాది ఇండియన్ సినిమాలో రెండు అతిపెద్ద బ్లాక్‌బస్టర్ సినిమాలు ఒకే రోజు డిజిటల్ ప్రీమియర్ కాబోతున్నాయి. వీటిలో ఒకటి కాంతార ఛాప్టర్ 1 కాగా.. మరొకటి మలయాళం మూవీ లోకా: ఛాప్టర్ 1. ఈ రెండు మూవీస్ వేర్వేరు ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి.

ఒకే రోజు ఓటీటీలోకి రెండు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలు.. మలయాళం సూపర్ హీరో మూవీ.. కన్నడ యాక్షన్ థ్రిల్లర్
ఒకే రోజు ఓటీటీలోకి రెండు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలు.. మలయాళం సూపర్ హీరో మూవీ.. కన్నడ యాక్షన్ థ్రిల్లర్

ఒక్క రోజు.. రెండు బ్లాక్‌బస్టర్లు..

ఈవారం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 31న చాలా సినిమాలే రాబోతున్నాయి. అయితే వీటిలో అందరి దృష్టి మాత్రం రెండు సినిమాలపైనే ఉంది. వీటిలో ఒకటి కాంతార ఛాప్టర్ 1. ఈ నెల 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. అది కూడా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.800 కోట్లకుపైగా వసూళ్లతో ఈ ఏడాది అత్యధిక వసూళ్ల ఇండియన్ సినిమాగా నిలిచినా.. అప్పుడే డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ సినిమా అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఇక మరొకటి మలయాళం ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్ల సూపర్ హీరో మూవీ లోకా: ఛాప్టర్ 1. తెలుగులో కొత్త లోక పేరుతో రిలీజైంది. కల్యాణి ప్రియదర్శన్ ఫిమేల్ సూపర్ హీరో పాత్ర పోషించింది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకుపైగా వసూలు చేసి.. ఈ ఘనత సాధించిన తొలి మలయాళం మూవీగా నిలిచింది. ఇప్పుడీ సినిమా శుక్రవారం (అక్టోబర్ 31) నుంచే జియోహాట్‌స్టార్ లో ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

కాంతార, లోకా.. రెండూ రెండే

కాంతార ఛాప్టర్ 1, లోకా ఛాప్టర్ 1.. ఈ సౌత్ ఇండియన్ మూవీస్ ఈ ఏడాది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలన విజయాలు సాధించాయి. కాంతార ఛాప్టర్ 1 ఓ ప్రీక్వెల్ కాగా.. లోకా ప్రాంఛైజీలో తొలి సినిమా. రెండూ పూర్తిగా వేర్వేరు జానర్లకు చెందిన మూవీస్. అయితే ఇవి రెండూ బాక్సాఫీస్ దుమ్ము దులిపాయి.

ఈ రెండు సినిమాలూ తెలుగులోనూ థియేటర్లలో రిలీజై.. ఇక్కడా వసూళ్ల వర్షం కురిపించాయి. దీంతో ఈ రెండు మూవీస్ డిజిటల్ ప్రీమియర్ పై ఎంతగానో ఆసక్తి నెలకొంది. అయితే ఒకే రోజు ఇవి రెండూ రానుండటం మాత్రం సినిమా లవర్స్ కు ఓ పండగలాంటి వార్తే అని చెప్పొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More