...
...
Next Story

OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్-గూస్ బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్-స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Release: ఓటీటీ లవర్స్ అలర్ట్. మీకు అదిరిపోయే థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు మరో మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ రెడీ అయింది. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇవాళ రిలీజైన ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం పక్కా. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Oct 2, 2026, 21:52:29 IST
Advertisement

OTT Release: మలయాళ చిత్రసీమలో విశేష ఆదరణ పొందిన 'ఉయరే', 'కాణెక్కిణే' చిత్రాల దర్శకుడు మను అశోకన్ తెరకెక్కించిన తాజా సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఐస్' (Eyes). దేవ్‌ మోహన్, నిఖిలా విమల్, కని కుసృతి, శృతి రామచంద్రన్, సనియా అయ్యప్పన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ (అక్టోబర్ 2) ప్రకటించారు.

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్-గూస్ బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్-స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్-గూస్ బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్-స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మలయాళ పరిశ్రమ నుంచి వచ్చే క్రైమ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్లకు ఓటీటీలో ఉండే క్రేజ్ వేరు. ఆ కోవలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘ఐస్’. డ్రీమ్‌క్యాచర్ బ్యానర్‌పై టి.ఆర్.షంషుద్దీన్ నిర్మించిన ఈ సిరీస్ అక్టోబర్ 9, 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. "వాచ్.. డిఫెండ్.. ప్రొటెక్ట్" (Watch. Defend. Protect.) అనే క్యాప్షన్‌తో విడుదల ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ ట్రైలర్ తో సిరీస్ పై అంచనాలు మరింత పెరిగాయి.

ప్రేమ సైకోసిస్‌గా మారితే

ఈ సిరీస్ స్టోరీ మానవ సంబంధాల వెనుక ఉండే చీకటి కోణాలను స్పృశిస్తుంది. మనుషుల మధ్య ఉండే ప్రేమ, నమ్మకం అబ్సెషన్ గా మారి, అతిగా ఉంటే ఏమవుతుందో ఇందులో అత్యంత ఆసక్తికరంగా చూపించబోతున్నారు. మనం అమితంగా ప్రేమించే వ్యక్తే మనకు ఒక ముప్పుగా, భయానకమైన బెదిరింపుగా మారినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, దాగి ఉన్న ఆ భయాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నల చుట్టూ కథనం సాగుతుంది.

'ఉయరే', 'కాణెక్కిణే' వంటి క్లాసిక్ సినిమాలను అందించిన దర్శకుడు మను అశోకన్ ఈ సిరీస్‌ను తెరకెక్కించడంతో హైప్ పెరిగింది. అంజనా నాయర్ అందించిన కథకు మలయాళంలో లెజెండరీ రైటింగ్ జంటగా గుర్తింపు పొందిన బాబీ-సంజయ్ స్క్రీన్‌ప్లే సమకూర్చడం విశేషం.

బంధాలలో ఏర్పడే వైరుధ్యాలు, మానసిక సంఘర్షణలను తెరపై ఆవిష్కరించడంలో బాబీ-సంజయ్‌లకు ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ట్విస్టులతో నిండిన ఈ ఐస్ సిరీస్ డిజిటల్ వీక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks