OTT Thriller: ఫ్యూచర్ ముందే తెలిసే వరం-జియోహాట్‌స్టార్‌లోకి సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్-చిరంజీవి కుతురు ప్రొడ్యూసర్
OTT Thriller: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లోకి ఓ అదిరిపోయే సిరీస్ రాబోతుంది. ఫ్యూచర్ ముందే తెలుసుకొనే వరం పొందే కుర్రాడి కథతో ఈ సిరీస్ తెరకెక్కింది. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సిరీస్ పూర్తి వివరాలపై లుక్కేయండి.
OTT Thriller: డిఫరెంట్ జోనర్ సినిమాలు, సిరీస్ లతో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న పాపులర్ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ మరో కొత్త సిరీస్ ను తీసుకొస్తుంది. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గా తెరకెక్కిన ‘వరం’ ఓటీటీ స్ట్రీమింగ్ ను జియోహాట్‌స్టార్ ప్రకటించేసింది.

వరం ఓటీటీ
సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో రెడీ అయిన వరం వెబ్ సిరీస్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 9 నెలల క్రితమే ఈ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు. అప్పుడే కమింగ్ సూన్ అని అనౌన్స్ చేశారు. కానీ ఇన్ని రోజులకు స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించారు.
థ్రిల్లర్ సిరీస్
వరం సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ఇదే నెలలో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 22 నుంచి ఈ సిరీస్ ఓటీటీలో అందుబాటులో ఉంటుందని జియోహాట్‌స్టార్ ఇవాళ (అక్టోబర్ 1) అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అంతేకాకుండా క్రేజీ అనౌన్స్ మెంట్ వీడియోనూ రిలీజ్ చేసింది.
స్టోరీ ఏంటంటే?
ఒక నిరుపేద బస్తీలో రాజు అనే కుర్రాడు ఉంటాడు. అతను పబ్లిక్ టాయిలెట్ లో పని చేస్తుంటాడు. అతను ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ ఆ అమ్మాయిని రాష్ట్ర మంత్రి తన సొంతం చేసుకోవాలనుకుంటాడు.
ఓ వైపు పేదరికం, మరోవైపు ప్రేమించిన అమ్మాయి.. ఈ నేపథ్యంలోనే రాజుకు ఓ అద్భుతమైన వరం లభిస్తుంది. రేపు జరగబోయే భవిష్యత్తును ఈరోజే తెలుసుకోగలిగే శక్తి అతనికి వస్తుంది. ఈ వరంతో కథ మలుపు తిరుగుతుంది.
మరి ఈ రహస్య విద్యతో అతను తన పేదరికం నుంచి బయటపడి, జీవితంలో ఎలా స్థిరపడ్డాడు? అయితే, భవిష్యత్తును ముందుగానే మార్చడానికి ప్రయత్నించినప్పుడు అతను ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ తెలుగు ఫాంటసీ క్రైమ్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు.
రాజశేఖర్ కూతురు
ఈ వరం వెబ్ సిరీస్ లో విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటించాడు. అతని సరసన సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అంతేకాకుండా శ్రీనివాస్ అవసరాల, ధనరాజ్ వినీత్, జైయేత్రి, శ్రుతి జయన్ తదితరులు నటించారు.
ప్రొడ్యూసర్ గా మెగా డాటర్
ఈ వెబ్ సిరీస్ ను చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల నిర్మించారు. మెగా డాటర్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సిరీస్ పై హైప్ ఏర్పడింది. ఈ సిరీస్ కు ఆదిత్య మండాల డైరెక్టర్. మరి ఇదే నెలలో ఓటీటీలోకి రాబోతున్న వరం వెబ్ సిరీస్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


