OTT Trending: అదిరే ట్విస్ట్‌-క‌దిలించే ఎమోష‌న్‌-వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఓటీటీ నంబ‌ర్ వ‌న్‌-ఈ తెలుగు మూవీని ఎంతమంది చూశారంటే?

OTT Trending: సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్ తో థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన తెలుగు సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ మూవీగా ట్రెండ్ అవుతోంది. ఓటీటీలో రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ? ఏ ఓటీటీలో ఉందో చూసేయండి. 

Published on: Sep 30, 2026, 11:40:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Trending: రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఆడియన్స్ ను ఫ్యామిలీలకు ఫ్యామిలీలు థియేటర్లకు రప్పించిన మూవీ ‘ఇరుముడి’. రవితేజ హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తోంది. వరల్డ్ వైడ్ గా నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.

అదిరే ట్విస్ట్‌-క‌దిలించే ఎమోష‌న్‌-వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఓటీటీ నంబ‌ర్ వ‌న్‌-ఈ తెలుగు మూవీని ఎంతమంది చూశారంటే?
అదిరే ట్విస్ట్‌-క‌దిలించే ఎమోష‌న్‌-వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఓటీటీ నంబ‌ర్ వ‌న్‌-ఈ తెలుగు మూవీని ఎంతమంది చూశారంటే?

ఇరుముడి ఓటీటీ

మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఇరుముడి' (Irumudi) థియేటర్లనే కాకుండా ఓటీటీలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఇరుముడి మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

గ్లోబల్ నంబర్ వన్

ఇరుముడి మూవీకి ఓటీటీలోనూ అదిరిపోయే క్రేజ్ దక్కుతోంది. నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసిన సెప్టెంబర్ 21-27 గ్లోబల్ టాప్ 10 నాన్-ఇంగ్లీష్ సినిమాల కేటగిరీలో ఇరుముడి ఏకంగా ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంది. సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రాన్ని అధిగమించి ఇరుముడి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

ఎంతమంది చూశారంటే?

థియేటర్లలో ఊహించని విజయాన్ని అందుకున్న రవితేజ 'ఇరుముడి' చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌‌లో వేరే లెవల్ రీతిలో వ్యూవర్‌షిప్ సాధిస్తోంది. గత వారంలో గ్లోబల్ చాట్‌లో మూడో స్థానంలో ఉన్న ఈ సినిమా.. ఇప్పుడు ఏకంగా నంబర్ వన్ పొజిషన్ కు వచ్చింది.

సెప్టెంబర్ 21 నుంచి 27వ తేదీ వరకు ఇరుముడి సినిమాకు ఓటీటీలో 34 లక్షల వ్యూస్ దక్కాయి. ఈ వ్యూస్ తో ఇరుముడి టాప్ ప్లేసుకు చేరుకుంది. మొత్తం 81 లక్షల గంటల పాటు ఈ మూవీని చూశారు. గత వారం మొదటి స్థానంలో నిలిచిన సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రాన్ని కిందకు నెట్టి 'ఇరుముడి' అగ్రపీఠాన్ని దక్కించుకోవడం విశేషం.

బ్లాక్ బస్టర్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ నిర్మించిన ఇరుముడి చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. బేబీ నక్షత్ర, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, శివ నిర్వాణ భావోద్వేగపూరితమైన కథనం ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించాయి.

ఇరుముడి సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. థ్రిల్, సస్పెన్స్ కూడా ఉంది. ముఖ్యంగా తండ్రీకూతురు బంధం, ఆఖర్లో హత్య ఎవరు చేశారనే ట్విస్ట్ సినిమాకు వెన్నెముకలా నిలిచాయి. కేవలం ఒకే ఫార్ములాకు పరిమితం కాకుండా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఈ ఇరుముడి సినిమాను శివ నిర్వాణా తెరకెక్కించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More