Toxic OTT: టాక్సిక్ ఎక్కడ? ఓటీటీ ఆడియన్స్ కు మరో షాక్.. అక్టోబర్ లోనూ డిజిటల్ రిలీజ్ లేనట్లే.. అసలేం జరుగుతుందంటే?
Toxic Ott Release Date: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన బిగ్ ప్రాజెక్ట్ ‘టాక్సిక్’. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ఈ మూవీ బొక్కబోర్లా పడింది. డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో థియేటర్లలో చూడని ఆడియన్స్ టాక్సిక్ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్లకు మరోసారి షాక్ తగిలింది.
Toxic Ott Release Date: యష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ చిత్రం డిజిటల్ ప్రిమియర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అక్టోబర్ లోనూ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.

థియేటర్లలో డిజాస్టర్
'కేజీయఫ్' లాంటి బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ సినిమాల తర్వాత యష్ నటించిన చిత్రం ‘టాక్సిక్’. అయితే పలు విడతలుగా వాయిదా పడుతూ వచ్చి ఆగస్టులో థియేటర్లలోకి ఈ మూవీ రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో చూడాలని చాలామంది సినీ ప్రియులు, యష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అక్టోబర్‌లోనూ లేని టాక్సిక్
సాధారణంగా థియేట్రికల్ రన్ ముగిసిన 4 నుంచి 6 వారాల్లో సినిమాలు డిజిటల్ ప్రిమియర్ కు వస్తున్నాయి. ఆ లెక్కన సెప్టెంబర్ చివరి వారంలో టాక్సిక్ ఓటీటీలోకి రావాల్సింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25 నుంచి జీ5లో 'టాక్సిక్' స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ సెప్టెంబర్‌లో మూవీ రాలేదు. ఇక తాజాగా జీ5 అధికారికంగా విడుదల చేసిన అక్టోబర్ ఓటీటీ రిలీజ్ క్యాలెండర్‌లోనూ 'టాక్సిక్' పేరు లేకపోవడం గమనార్హం. దీంతో ఈ చిత్రం డిజిటల్ విడుదల మరింత ఆలస్యం కానుందని స్పష్టమవుతోంది.
భారీ బడ్జెట్ తో
కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన టాక్సిక్ చిత్రంలో యష్ సరసన బాలీవుడ్, సౌత్ భామలు సందడి చేశారు. యష్ తో పాటు కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా తదితరులు నటించారు. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ డైరెక్టర్. రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు.
ఓటీటీలోకి ఎప్పుడు?
థియేటర్లలో మిస్ అయినవారు, మళ్లీ ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను వీక్షించాలనుకునే వారు టాక్సిక్ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే మేకర్స్ ఇంకా రిలీజ్ డేట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. అసలు ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
అదే కారణమా?
థియేటర్లలో డిజాస్టర్ లేదా డిజప్పాయింటింగ్ ఫలితాన్ని మూటగట్టుకున్న భారీ బడ్జెట్ సినిమాల ఓటీటీ విడుదల ఆలస్యం కావడం వెనుక తరచూ బిజినెస్ రీ-నెగోషియేషన్స్ ఉంటాయి. థియేట్రికల్ రన్‌కు ముందు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం బాక్సాఫీస్ టార్గెట్లు అందకపోతే ఓటీటీ సంస్థలు, ప్రొడ్యూసర్ల మధ్య డీల్ తగ్గుదల లేదా స్ట్రీమింగ్ విండో మార్పులపై చర్చలు జరుగుతుంటాయి.
'కేజీయఫ్ 2' లాంటి రికార్డ్ బ్రేకింగ్ హిట్ తర్వాత వచ్చిన యష్ ప్రాజెక్ట్ కావడంతో టాక్సిక్ కు ఓటీటీ రేట్లు భారీగా పలికాయి. అయితే ఆగస్టు థియేట్రికల్ ఫలితం ఆశించిన రీతిలో లేకపోవడంతో జీ5 డిజిటల్ రైట్స్ నిబంధనలపై ఆలోచిస్తుందనే టాక్ వినిపిస్తోంది. దసరా లేదా దీపావళి ఫెస్టివ్ సీజన్లను లక్ష్యంగా చేసుకుని సరికొత్త ప్రమోషనల్ ప్లాన్‌తో ఈ మూవీని లేట్‌గా ఓటీటీలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


