OTT Malayalam Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న మరో మలయాళ సైకలాజికల్ డార్క్ థ్రిల్లర్.. 7.6 రేటింగ్
OTT Malayalam Thriller: ఓటీటీలోకి మరో మలయాళం సైకలాజికల్ డార్క్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. తెలుగులోనూ వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జోజు జార్జ్, ఊర్వశి లీడ్ రోల్స్ లో నటించారు.
OTT Malayalam Thriller: మలయాళ విలక్షణ నటి ఊర్వశి (Urvashi) లీడ్ రోల్‌లో నటించిన మైండ్ బెండింగ్ మలయాళం సైకలాజికల్ డార్క్ థ్రిల్లర్ 'ఆశ' (Aasha) ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు అధికారికంగా డేట్ లాక్ చేసుకుంది. థియేటర్లలో తన డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రశంసలు అందుకున్న ఈ సినిమా.. అక్టోబర్ 16 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

నాలుగు భాషల్లో 'జీ5'లో స్ట్రీమింగ్
థియేటర్లలో సెప్టెంబర్ 11న విడుదలైన ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని కొత్త దర్శకుడు సఫర్ సనాల్ (Safar Sanal) అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. జీ5 ఓటీటీ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకోగా.. అక్టోబర్ 16 నుంచి డిజిటల్ ప్రీమియర్ ప్రారంభం కానుంది.
సౌత్ డిజిటల్ ఆడియన్స్ కోసం కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ భాషల డబ్బింగ్ వర్షన్లను ఒకేసారి అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
రోడ్డు ప్రమాదం తెచ్చిన నరకం.. అసలు కథేంటి?
ఓ చిన్న నర్సరీ నడుపుకునే ఆశా (ఊర్వశి) గతంలో జరిగిన ఒక చేదు సంఘటన వల్ల మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన మహిళ. ఆమె తన ఐటీ ఉద్యోగి అయిన కూతురు అనఘ (ఐశ్వర్య లక్ష్మి)తో కలిసి నివసిస్తుంటుంది. ఒక రాత్రి వేళ వీళ్ల కారు జీమన్ (జోజు జార్జ్) అనే వ్యక్తి వాహనాన్ని ఢీకొడుతుంది.
ఆ చిన్న యాక్సిడెంట్ పెరిగి పెద్దదై తీవ్రమైన గొడవగా మారుతుంది. విషయాన్ని అక్కడితో ముగించేద్దామని ఎంత మంది కోరినా, మొండి పట్టుదలతో ఉన్న ఆశా పోలీస్ కేసుకు వెళ్తుంది. ఆ ఒక్క నిర్ణయం వల్ల ఇరు కుటుంబాల మధ్య సైకలాజికల్ వార్, రివెంజ్, తీవ్రమైన మానసిక పరిణామాలు ఎలా ఎదురయ్యాయి అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్.
'లేడీ సూపర్‌స్టార్' ఊర్వశి నటన వేరే లెవెల్
ఈ సినిమాకు ప్రధాన బలం ఊర్వశియే. ఆమె మరోసారి తన విశ్వరూపం చూపించారు. ఒక తల్లి అనుభవించే తీవ్రమైన మానసిక ఆందోళనను, భయాన్ని, మొండితనాన్ని ఆమె తన కళ్లలోనే పలికించారు. ఆమె నటన సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
ఆమెతో పాటు జోజు జార్జ్ (Joju George) రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్‌లో అద్భుతంగా ఒదిగిపోయారు. 'పొన్నియిన్ సెల్వన్', '#లవ్' ఫేమ్ ఐశ్వర్య లక్ష్మి కూతురి పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. విజయరాఘవన్ కీలక పాత్రలో మెప్పించారు.
గ్రిప్పింగ్ ఫస్ట్ హాఫ్.. టెక్నికల్ వేల్యూస్ ఎలా ఉన్నాయంటే?
దర్శకుడు సఫర్ సనాల్ మొదటి భాగంలో ఉత్కంఠను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు. మధు నీలకందన్ సినిమాటోగ్రఫీ డార్క్ అట్మాస్ఫియర్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేయగా, 'తైక్కుడం బ్రిడ్జ్' ఫేమ్ గోవింద్ వసంత అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్ ఫాక్టర్‌ను బాగా పెంచింది.
అయితే సెకండ్ హాఫ్‌లో స్క్రీన్‌ప్లే కాస్త స్లో అవ్వడం, కొన్ని రెగ్యులర్ ట్విస్టులు ఉండటం మినహా, సైకలాజికల్ డ్రామా ప్రేమికులకు ఈ సినిమా మంచి అనుభూతిని ఇస్తుంది. మైండ్ బెండింగ్ థ్రిల్లర్స్, డార్క్ కాన్సెప్ట్‌లు ఇష్టపడే సినీ ప్రియులు అక్టోబర్ 16 నుంచి జీ5 ఓటీటీలో ఈ చిత్రాన్ని హ్యాపీగా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


