ఓటీటీలోకి ఈవారం ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి మలయాళం సూపర్ హీరో మూవీ లోకా ఛాప్టర్ 1 చంద్ర. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీగా రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి శుక్రవారం (అక్టోబర్ 31) రాబోతోంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ బ్రేక్ చేసిన రికార్డులేవో చూడండి.
లోకా ఛాప్టర్ 1 బ్రేక్ చేసిన రికార్డులు ఇవే

కల్యాణి ప్రియదర్శన్ నటించిన మూవీ లోకా ఛాప్టర్ 1 చంద్ర. ఈ సినిమా ఏడు భాషల్లో శుక్రవారం నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు ఇలా ఉన్నాయి.
అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీ
'లోకా ఛాప్టర్ 1: చంద్ర' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మూవీ మోహన్‌లాల్ నటించిన భారీ బ్లాక్‌బస్టర్ 'ఎల్2: ఎంపురాన్' సినిమా లైఫ్‌టైమ్ కలెక్షన్లను (రూ. 266.81 కోట్లు) అధిగమించి.. మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా అవతరించింది.
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'లూసిఫర్' సీక్వెల్ 'ఎల్2: ఎంపురాన్' ఇప్పుడు రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో 2024 బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'మంజుమ్మెల్ బాయ్స్' (రూ. 241.03 కోట్లు) నిలిచింది. అయితే స్టార్ హీరోలతో నిండిన 'ఎంపురాన్'తో పోలిస్తే, 'లోకా'కు తొలి రోజున అంత హైప్ లేదు. అందుకే ఓపెనింగ్ డే రికార్డును మాత్రం 'ఎంపురాన్'ను అధిగమించలేకపోయింది.
300 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మలయాళ మూవీ
'లోకా' మూవీ కేవలం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగానే కాకుండా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ.303.57 కోట్లుగా నమోదయ్యాయి. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ వంటి స్టార్ హీరోలు అతిథి పాత్రల్లో మెరిశారు.
కేరళలో అత్యధిక వసూళ్ల మూవీ
{{/usCountry}}'లోకా' మూవీ కేవలం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగానే కాకుండా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ.303.57 కోట్లుగా నమోదయ్యాయి. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ వంటి స్టార్ హీరోలు అతిథి పాత్రల్లో మెరిశారు.
కేరళలో అత్యధిక వసూళ్ల మూవీ
{{/usCountry}}కేవలం ప్రపంచవ్యాప్తంగానే కాదు కేరళ రాష్ట్రంలో కూడా 'లోకా' సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విషయంలో కల్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా.. గతంలో మోహన్‌లాల్ నటించిన 'తుడరుమ్' రికార్డును బద్దలు కొట్టింది. గతంలో కేరళలో రూ. 118 కోట్లు వసూలు చేసిన 'తుడరుమ్' రికార్డును 'లోకా' అధిగమించింది.
'పాన్-ఇండియన్' బ్లాక్‌బస్టర్‌గా గుర్తింపు
ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైన 'లోకా' మూవీ.. కేరళతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా రూ. 100 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి మలయాళ చిత్రంగా నిలిచింది. ఈ మైలురాళ్లతో పాటు మిగతా ఇండియా కలెక్షన్ల నుంచి రూ. 50 కోట్లు ఆర్జించడంతో.. ట్రేడ్ ట్రాకర్లు ఈ సినిమాను 'పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్'గా ధ్రువీకరించారు. ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ రూ. 183.67 కోట్లు కాగా.. ఓవర్సీస్ కలెక్షన్ రూ. 119.9 కోట్లుగా ఉంది.
కల్యాణి ప్రియదర్శన్: మలయాళంలో సరికొత్త చరిత్ర
ఈ సినిమా విజయం కథానాయిక కల్యాణి ప్రియదర్శన్‌కు కూడా అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చింది. రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన ఓ సినిమాలో లీడ్ రోల్ పోషించిన మొట్టమొదటి మలయాళ నటిగా ఆమె చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా రూ. 300 కోట్ల క్లబ్‌లో ఉన్న ఏకైక మలయాళ యాక్టర్ కూడా ఆమెనే కావడం విశేషం. టాప్ లిస్ట్‌లో ఉన్న మిగతా సినిమాలు అన్నీ హీరో-సెంట్రిక్ కావడంతో.. 'లోకా' విజయం నిజంగా ప్రత్యేకమైనదిగా నిలిచింది.
లోకా మూవీ గురించి..
కల్యాణి ప్రియదర్శన్ తోపాటు నస్లెన్ కూడా నటించిన ఈ లోకా మూవీ.. ఒక అంతుచిక్కని మహిళ అయిన 'చంద్ర' కథను చెబుతుంది. ఆమె అవయవాల అక్రమ రవాణా చేసే ఒక రాకెట్‌లో చిక్కుకుంటుంది. అయితే కేరళలోని ఒక ప్రసిద్ధ జానపద కథను ఆధునిక దృక్పథంలో పునర్నిర్మించిన ఈ సినిమాలో.. చంద్రకు మానవాతీత శక్తులు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? చంద్ర ఏం చేసింది అన్నది ఈ సినిమాలో చూడొచ్చు.