...
...
Next Story

Mohanlal: పెళ్లయ్యాక ఏడుస్తూ ఇంటికి వస్తే రానివ్వను: మోహన్‌లాల్‌తో పెళ్లికి ముందు సుచిత్రకు తండ్రి వార్నింగ్.. ఎందుకంటే?

Mohanlal Wife: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ భార్య సుచిత్ర చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయనతో పెళ్లికి ముందు సుచిత్ర తండ్రి ఇచ్చిన వార్నింగ్ గురించి ఆమె తాజాగా వెల్లడించారు. ఆ విశేషాలు ఇక్కడ చూడండి.

Published on: Aug 25, 2026, 20:07:12 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Mohanlal Wife: మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ భార్య సుచిత్ర తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమ పెళ్లి నాటి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. మోహన్ లాల్‌ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పినప్పుడు ఆమె తండ్రి, ప్రముఖ తమిళ నిర్మాత కే బాలాజీ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారట. "ఏడుస్తూ వెనక్కి వస్తే ఇంట్లోకి రానివ్వను" అని ఆయన తేల్చి చెప్పిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఫ్యాన్ మోడ్‌లో కలిసి.. ఆ తర్వాత లవ్ స్టోరీ

Mohanlal: పెళ్లయ్యాక ఏడుస్తూ ఇంటికి వస్తే రానివ్వను: మోహన్‌లాల్‌తో పెళ్లికి ముందు సుచిత్రకు తండ్రి వార్నింగ్.. ఎందుకంటే?
Mohanlal: పెళ్లయ్యాక ఏడుస్తూ ఇంటికి వస్తే రానివ్వను: మోహన్‌లాల్‌తో పెళ్లికి ముందు సుచిత్రకు తండ్రి వార్నింగ్.. ఎందుకంటే?

సుచిత్ర మొదటిసారి మోహన్ లాల్‌ను ఒక పెళ్లి వేడుకలో చూశారట. ఆ సమయంలో రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి పరిచయం ఉండటంతో, ఒక సాధారణ అభిమానిలా వెళ్ళి ఆయనతో ఫోటో దిగారు. కానీ ఆ రోజు దిగిన ఫోటో కాపీ ఆమెకు ఎప్పటికీ దక్కలేదు.

ఆ తర్వాత మోహన్ లాల్‌ను పెళ్లి చేసుకోవాలనే కోరికను సుచిత్ర తమ ఇంట్లో బయటపెట్టారు. ఆమె ప్రతిపాదనకు కుటుంబం నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు. సీనియర్ నటి సుకుమారి ద్వారా ఈ పెళ్లి సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లారు.

"ఏడుస్తూ వస్తే రానివ్వను".. కే బాలాజీ గట్టి హెచ్చరిక

సుచిత్ర తండ్రి కే బాలాజీ తమిళ చిత్ర పరిశ్రమలో రజినీకాంత్ 'బిల్లా' వంటి బిగ్ హిట్ సినిమాలు తీసిన ప్రముఖ ప్రొడ్యూసర్. సినిమా ఇండస్ట్రీ వాతావరణం, షూటింగ్ షెడ్యూల్స్ ఎంత బిజీగా ఉంటాయో ఆయనకు బాగా తెలుసు. అందుకే మోహన్ లాల్‌తో పెళ్లికి ముందు సుచిత్రను పిలిచి ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశారు.

"నువ్వు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావు. ఆయన కొన్నిసార్లు రోజులు తరబడి షూటింగ్‌లో ఉండి ఇంటికి రాకపోవచ్చు. ఇండస్ట్రీలో రకరకాల రూమర్స్ వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని అడ్జస్ట్ అవ్వాలి. రేపు ఏదైనా గొడవ జరిగి మూతి ముడుచుకుని, ఏడుస్తూ నా దగ్గరకు వస్తే నేను ఇంట్లోకి రానివ్వను. అన్నింటికీ సిద్ధపడి ఆలోచించుకుని నిర్ణయం తీసుకో" అని చెప్పారట.

భర్తగా మోహన్ లాల్ రెస్పాన్స్ మైండ్ బ్లోయింగ్

ఒకసారి కే బాలాజీ మోహన్ లాల్‌తో సరాదాగా.. "నా కూతురిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని పాడుచేస్తున్నావు" అన్నారట. దానికి మోహన్ లాల్ బదులిస్తూ.. "మీరు చూసుకున్న దానికంటే నేను ఇంకా బాగా చూసుకోవాలి కదా" అని ఆన్సర్ ఇచ్చారట. ఈ జవాబు విన్నాక తన తండ్రి ఎంతగానో ఆనందించారని సుచిత్ర తెలిపారు.

38 ఏళ్ల బంధం.. అద్భుతమైన సపోర్ట్ సిస్టమ్

1988 ఏప్రిల్ 28న మోహన్ లాల్, సుచిత్రల వివాహం జరిగింది. వీరికి కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ (హీరో), కుమార్తె విస్మయ ఉన్నారు. దేశవ్యాప్తంగా విపరీతమైన స్టార్‌డమ్ ఉన్న సూపర్ స్టార్ భార్య అయినప్పటికీ సుచిత్ర ఎప్పుడూ మీడియాకు, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటారు. మోహన్ లాల్ సాధించిన దిగ్గజ విజయం వెనుక సుచిత్ర ఒక బలమైన సపోర్ట్ సిస్టమ్‌లా నిలిచారు. మరోవైపు మోహన్ లాల్ ఈ మధ్యే దృశ్యం 3తో మరో హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks