OTT Malayalam Thriller: సస్పెన్స్ థ్రిల్లర్స్, రియలిస్టిక్ డ్రామాలను తెరకెక్కించడంలో మలయాళ చిత్ర పరిశ్రమ శైలే వేరు. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, బలమైన కథాంశంతో ప్రేక్షకుల మనసులను దోచుకోవడంలో అక్కడి సినిమాలు ఎప్పుడూ ముందుంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన 'ICU' (Intensive Care Unit) మూవీ ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది.

నవంబర్ 6 నుంచి ఈ మూవీ సన్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. కేవలం ఒక గంట 51 నిమిషాల నిడివితో ఉండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు యు/ఎ (U/A) సెన్సార్ సర్టిఫికేట్ లభించింది. బిబిన్ జార్జ్, బాబూరాజ్, మురళీ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా వివరాలు ఇవే.
'ICU' కథాంశం ఏమిటంటే?
మలయాళం థ్రిల్లర్ సినిమాలంటే ఓ చిన్న స్టోరీని చివరి వరకూ ఉత్కంఠ రేపే విధంగా ఉంటాయి. అలాంటి స్టోరీతోనే వచ్చిన మూవీ ఈ ఐసీయూ. ఫిబ్రవరిలోనే థియేటర్లలోకి రాగా.. సుమారు 10 నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
హాస్పిటల్ ఐసీయూ (Intensive Care Unit) నేపథ్యంలో అత్యంత ఉత్కంఠభరితంగా ఈ చిత్రం సాగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు, వారిని కాపాడటానికి పోరాడే వైద్యులు, ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యుల చుట్టూ కథ తిరుగుతుంది. అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో మోరల్, ఎమోషనల్ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనేదే ఈ చిత్ర ముఖ్య కథాంశం.
దర్శకుడు జార్జ్ వర్గీస్ కథను నడిపించిన తీరు, స్క్రీన్‌ప్లే మైండ్ బ్లాకింగ్ ట్విస్టులతో సాగడం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. భయం, భావోద్వేగం, సస్పెన్స్ కలగలిపిన కథాంశంతో కథనాన్ని వేగంగా ముందుకు నడిపించారు.
ఐసీయూ నటీనటులు, క్రూ పనితీరు ఎలా ఉందంటే?
{{/usCountry}}దర్శకుడు జార్జ్ వర్గీస్ కథను నడిపించిన తీరు, స్క్రీన్‌ప్లే మైండ్ బ్లాకింగ్ ట్విస్టులతో సాగడం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. భయం, భావోద్వేగం, సస్పెన్స్ కలగలిపిన కథాంశంతో కథనాన్ని వేగంగా ముందుకు నడిపించారు.
ఐసీయూ నటీనటులు, క్రూ పనితీరు ఎలా ఉందంటే?
{{/usCountry}}ఈ ఐసీయూ చిత్రంలో నటీనటుల పనితీరుకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఇందులో ముఖ్య పాత్రలు పోషించిన బిబిన్ జార్జ్ (ఉన్ని), బాబూరాజ్ (మైఖేల్), మురళీ గోపి (ఫ్రాన్సిస్), విస్మయ అనీష్ (ఇందు), శ్రీకాంత్ మురళి, మీరా వాసుదేవన్, నవాస్ వల్లిక్కున్ను తమ నటనతో ఆకట్టుకున్నారు.
ఇక 'మినిస్టూడియో' బ్యానర్‌పై జైన్ పాల్ ఈ చిత్రాన్ని నిర్మించగా, జోస్ ఫ్రాంక్లిన్ సంగీతాన్ని అందించారు. లోగనాథన్ శ్రీనివాసన్ సినిమాటోగ్రఫీ, లిజో పాల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
సగటు రివ్యూ ప్లాట్‌ఫామ్‌లలో 3.52/5 రేటింగ్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం.. రొటీన్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ స్థాయిలో ఉంటుందని విమర్శకులు సైతం ప్రశంసించారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను అభిమానించే ఓటీటీ ప్రియులకు నవంబర్ 6 నుంచి సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానున్న 'ICU' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.