...
...
Next Story

ఓటీటీలోకి ఒక రోజు ముందే వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. సీరియల్ కిల్లర్‌గా మెగాస్టార్.. తెలుగులో స్ట్రీమింగ్

ఓటీటీలోకి ఒక రోజు ముందే మలయాళం థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. మెగాస్టార్ మమ్ముట్టి ఓ సీరియల్ కిల్లర్ పాత్రలో నటించిన ఈ సినిమాను రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.80 కోట్లు వసూలు చేసింది.

Published on: Jan 15, 2026, 15:45:03 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని హీరోగా చూడటం అలవాటే. కానీ అతనిలోని భయానకమైన విలనిజాన్ని చూడాలంటే ‘కలంకావల్’ (Kalamkaval) చూడాల్సిందే. థియేటర్లలో ప్రేక్షకులను వెన్నులో వణుకు పుట్టించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది. సోనీ లివ్, ఓటీటీ ప్లే ప్రీమియం ద్వారా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

ఒక రోజు ముందే ఓటీటీలోకి..

ఓటీటీలోకి ఒక రోజు ముందే వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. సీరియల్ కిల్లర్‌గా మెగాస్టార్.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఒక రోజు ముందే వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. సీరియల్ కిల్లర్‌గా మెగాస్టార్.. తెలుగులో స్ట్రీమింగ్

మమ్ముట్టి నటించిన కలంకావల్ సినిమా గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. సుమారు 40 రోజుల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్ కు వచ్చింది. నిజానికి ఈ సినిమాను జనవరి 16న (శుక్రవారం) ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

కానీ సినిమా కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తూ.. ఒక రోజు ముందే, అంటే ఈ రోజే (జనవరి 15) స్ట్రీమింగ్ మొదలుపెట్టారు. గతంలో ‘రేఖాచిత్రం’, ‘మార్కో’ సినిమాల విషయంలోనూ ఇలాగే జరిగింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమా అందుబాటులో ఉంది.

కలంకావల్ మూవీ కథేంటంటే?

డెబ్యూ డైరెక్టర్ జితేన్ కె జోస్ తెరకెక్కించిన మూవీ ఈ కలంకావల్. కేరళ, తమిళనాడులో వరుసగా అదృశ్యమవుతున్న మహిళల మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. పోలీస్ అధికారి జయకృష్ణన్ (వినాయకన్) ఈ కేసుల వెనుక ఏదో ఒక ‘ప్యాటర్న్’ ఉందని గమనిస్తాడు. దర్యాప్తులో ఇదొక సీరియల్ కిల్లర్ పని అని, ఆ కిల్లర్ పేరు స్టాన్లీ దాస్ (మమ్ముట్టి) అని తేలుతుంది.

పోలీసుల వేట నుంచి తప్పించుకోవడానికి ఆ కిల్లర్ వేసే ఎత్తుగడలు, అతన్ని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ చేసే సాహసమే ఈ ‘కలంకావల్’. స్లో-బర్న్ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

2025లో మమ్ముట్టికి ఏకైక హిట్

కానీ ‘కలంకావల్’ మాత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇందులో మమ్ముట్టి నటన, జైలర్ ఫేమ్ వినాయకన్ పోలీస్ ఆఫీసర్‌గా కనబరిచిన ప్రతిభ సినిమాకు హైలైట్. గాయత్రి అరుణ్, రజీషా విజయన్, శ్రుతి రామచంద్రన్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ వీకెండ్‌లో ఇదొక బెస్ట్ ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe