మలయాళ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే తెలుగు ప్రేక్షకుల కోసం మరో సినిమా వచ్చేసింది. ఓ మర్డర్ మిస్టరీ కథతో ఆగస్టు 21న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పేరు ది కేస్ డైరీ. అష్కర్ సౌదాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మనోరమా మ్యాక్స్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.
మనోరమా మ్యాక్స్‌లో 'ది కేస్ డైరీ'

మలయాళం థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఓ చిన్న స్టోరీ లైన్ బేస్ చేసుకొని దానిని చాలా థ్రిల్లింగా చెప్పడంతో మలయాళ ఫిల్మ్ మేకర్స్ ఆరితేరిపోయారు. అయితే అన్ని సినిమాలూ అంత థ్రిల్ పంచలేవు. అలాంటిదే ది కేస్ డైరీ కూడా. థియేటర్లలో మూడు నెలల కిందట రిలీజైనా ప్రేక్షకుల ఆదరణ అంతగా దక్కలేదు. ఐఎండీబీలో కేవలం 3.5 రేటింగ్ మాత్రమే సాధించింది.
ఇప్పుడీ సినిమా మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి వచ్చింది. కేవలం మలయాళం ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీ చూడొచ్చు. ప్రస్తుత ట్రెండ్‌ల ప్రకారం 'ది కేస్ డైరీ' త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అష్కర్ సౌదాన్ నటించిన మరో చిత్రం 'బెస్టీ' కూడా త్వరలోనే మనోరమా మ్యాక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది.
'ది కేస్ డైరీ' స్టోరీ ఇదే
'ది కేస్ డైరీ' మూవీలో అష్కర్ సౌదాన్.. క్రిస్టీ శామ్ అనే సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నటించాడు. వివాదాస్పదమైన అజు హత్య కేసును విచారించడానికి క్రిస్టీ శామ్ వస్తాడు. ఈ విచారణలో భాగంగా అతను తెలుసుకున్న కొంత సమాచారం అతన్ని అజు అనే యువకుడి హత్య కేసు వైపు నడిపిస్తుంది. వ్యక్తిగత సమస్యగా మారిన ఈ కేసులో క్రిస్టీ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగిందన్నది ఇందులో చూడొచ్చు.
ఈ సినిమాలో రాహుల్ మాధవ్, విజయరాఘవన్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. దిలీప్ నారాయణన్ డైరెక్ట్ చేయగా.. స్క్రీన్‌ప్లేను ఏకే సంతోష్ అందించాడు. రియాజ్ ఖాన్, సాక్షి అగర్వాల్, నీరజ, అమీర్ నియాస్, గోకులన్, కిచు తెల్లస్, బాలా, మేఘనాథన్, బిజుకుట్టన్ లాంటి వాళ్లు కూడా నటించారు.
డిసెంబర్‌లో మరిన్ని సినిమాలు
{{/usCountry}}ఈ సినిమాలో రాహుల్ మాధవ్, విజయరాఘవన్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. దిలీప్ నారాయణన్ డైరెక్ట్ చేయగా.. స్క్రీన్‌ప్లేను ఏకే సంతోష్ అందించాడు. రియాజ్ ఖాన్, సాక్షి అగర్వాల్, నీరజ, అమీర్ నియాస్, గోకులన్, కిచు తెల్లస్, బాలా, మేఘనాథన్, బిజుకుట్టన్ లాంటి వాళ్లు కూడా నటించారు.
డిసెంబర్‌లో మరిన్ని సినిమాలు
{{/usCountry}}డిసెంబర్‌లో మనోరమా మ్యాక్స్‌లో అనేక సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో కుమార్ సునీల్, షమ్లా హంజా ముఖ్య పాత్రలు పోషించిన ప్రశంసలు పొందిన మూవీ 'ఫెమినిచి ఫాతిమా' కూడా ఉంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు దీని ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత వారం ఆంథాలజీ మూవీ 'షేడ్స్ ఆఫ్ లైఫ్' మనోరమా మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కు వచ్చింది. అదే ప్లాట్‌ఫామ్‌లో ఇటీవల ఇంద్రన్స్, మీనాక్షి అనూప్ నటించిన మరో కొత్త మలయాళ థ్రిల్లర్ 'ప్రైవేట్' కూడా విడుదలైంది. 'సర్కీట్', 'కరమ్', 'నెరారియుమ్ నేరత్' వంటి ఇతర చిత్రాలు కూడా మనోరమా మ్యాక్స్‌లో త్వరలో అందుబాటులో ఉంటాయి.